తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ వింగ్లో భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ మహేశ్ ఎం భగవత్ వెల్లడించారు.
హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ వింగ్లో భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఐజీ మహేశ్ ఎం భగవత్ వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఇలా సేకరించిన రక్తన్ని రెడ్క్రాస్ సొసైటీకి అందజేస్తామన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటెలిజెన్స్ విభాగం మరింత బలపడిందన్నారు. త్వరలో ఇంటెలిజెన్స్ విభాగంలో 452 పోస్టులను భర్తీ చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నగరానికి వచ్చిన వీవీఐపీలు వచ్చిన సందర్భాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ సేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.