
వరలక్ష్మీ శరత్ కుమార్
‘ఇది నా స్పెషల్ బర్త్ డే’ అంటున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఎందుకంత స్పెషల్? అని అడిగితే ‘ఈ బర్త్ డేకు సేవ్ శక్తి అని బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం, విజయ్ మురుగదాస్ నెక్ట్స్ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం రావడం’ అని అంటున్నారు. విషయం ఏంటంటే.. వరలక్ష్మీ నిర్వహించిన బ్లడ్ క్యాంప్‌లో దాదాపు 270 మంది పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారట. ఇక మురుగదాస్ డైరెక్షన్‌లో ఆమె చేయబోతున్న విషయానికి వస్తే.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇందులో వరలక్ష్మీ ఓ కీ రోల్ ప్లే చేస్తుందని ఆమె బర్త్ డే సందర్భంగా సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది. ఈ రెండు విషయాలు తనకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని, అందుకే ఈ బర్త్ డే స్పెషల్ అని వరలక్ష్మీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వరలక్ష్మీ డైరీ ఈ ఇయర్ మొత్తం ఫుల్ బిజీ. సుమారు 7 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారామె. అందులో ఒకటి తండ్రి శరత్‌కుమార్‌తో చేస్తోన్న ‘పాంబన్’ ఒకటి. తండ్రీకూతురు ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం ఇది.
Comments
Please login to add a commentAdd a comment