
దళితులపై చర్చంటే భయమెందుకు: సంపత్
దళిత సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఎందుకు భయపడు తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: దళిత సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఎందుకు భయపడు తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈటల విసిరిన సవాల్‌కు తాము స్పందించినా ఎందుకు వెనుకంజ వేస్తు న్నారో చెప్పాలన్నారు. దళిత సీఎం పేరుతో మొదలైన కేసీఆర్ మోసం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ది దళిత వ్యతిరేక ప్రభుత్వమన్నారు. దీనిని లెక్కలు, ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. ఆత్మాభి మానం ఉన్న దళిత ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ నుంచి బయటకు రావాలన్నారు.