కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్ (పాత పొటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులు చూపించినా తమను శాసనసభలోకి అనుమతించడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. ఎమ్మెల్యేలను శాసనసభలోకి అనుమతించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది.
ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తున్న అడిషనల్ ఏజీ రామచంద్రరావును మీరు ప్రభుత్వ న్యాయవాదా? లేక రాజకీయ పార్టీకి న్యాయవాదా? అని ప్రశ్నించింది. వారంలోగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ లా లేజిస్లేటివ్ సెక్రటరీలు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సివుంటుందని హెచ్చరించింది. వచ్చే నెల 3వ తేదీన ఈ కేసును కోర్టు మళ్లీ విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment