సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల (జూలై) 13కు వాయిదా పడింది. తమను ఎమ్మెల్యేలుగా పరిగణించాలన్న తీర్పును అమలు చేయక పోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌లు దాఖలుచేసి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment