ఒత్తిడితో సచ్చిపోతున్నా..  | Sampath Kumar Committed Suicide At Miryalaguda | Sakshi
Sakshi News home page

ఒత్తిడితో సచ్చిపోతున్నా.. 

Published Sun, Sep 20 2020 3:58 AM | Last Updated on Sun, Sep 20 2020 5:36 AM

Sampath Kumar Committed Suicide At Miryalaguda - Sakshi

మిర్యాలగూడ అర్బన్‌: ‘చదివి.. చదివి ఒత్తిడితో సచ్చిపోతున్నాం కేసీఆర్‌ సార్‌.. పుస్తకం తీయాలంటే వణుకు వస్తుంది. త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వండి’అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు విషం తాగాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన సంపత్‌కుమార్‌ చాలా రోజులుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కుటుంబానికి భారం అవుతున్నానని భావించి ఓ పురుగుల మందు డబ్బాను తెచ్చుకున్నాడు. సెల్ఫీ వీడియోలో తను పడిన మానసిక వేదనను వివరించి ఆ పురుగుల మందు తాగేశాడు. తన తండ్రి సత్యనారాయణ టైలర్‌గా పనిచేస్తూ ఉన్నత చదువులు చదివించినా, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియక, చేసేదిలేక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నానని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. విషం తాగి అపస్మారక స్థితిలోకి పోయిన సంపత్‌కుమార్‌ను గుర్తించిన తల్లితండ్రులు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement