సాక్షి, న్యూఢిల్లీ: శాసన సభ్యత్వాల రద్దు విషయంలో హైకోర్టులో ఊరట పొందిన తెలం గాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్‌ను శుక్రవారం ఢిల్లీలో కలవనున్నారు.
అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ ప్రభుత్వం తమ సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేయడం లాంటి పరిణామాలను ఆయనకు వివరించనున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కోమటిరెడ్డి, సంపత్‌లు రాహుల్‌గాంధీతోను భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment