న్యాయమైన డిమాండ్‌లపై సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా తాము సిద్ధమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంకోసం సోనియా గాంధీని సైతం ఎదిరించామని పేర్కొన్నారు.