సాక్షి, హైదరాబాద్: లక్షమంది కేసీఆర్‌లు కలిసినా ఉత్తముడైన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏమీ చేయలేరని ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు జరిగిన అన్యాయంపై గొంతెత్తిన పీసీసీ అధ్యక్షుడిపై అనాలోచితంగా మాట్లాడటం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత పోకడ పోతోందన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించలేకపోతోందని, వారిపై కక్షసాధిస్తోందని అన్నారు. అమరులకోసం జేఏసీ చైర్మన్ కోదండరాం యాత్ర చేపడితే ఆయనను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల కల్పనకు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పదోన్నతులు కల్పిస్తోందని మండిపడ్డారు. ఒక్క దళిత ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదని సంపత్‌కుమార్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment