అనర్హతకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్(పాత చిత్రం)
హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి కేవలం అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిలకు మాత్రమే పిటిషన్ వేసే అర్హత ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి, ఎమ్మెల్యేల తరపున వాదిస్తున్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పష్టంగా పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనర్హత కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసుకునే హక్కు లేదని అభిషేక్ తెలిపారు. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్పీల్ వేసే అర్హత లేదన్నారు.
ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ప్రకారం శాసనసభ మాత్రమే పిటిషన్ వేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పీకర్‌పై దాడికి సంబంధించి వీడియోలు సమర్పించడంతో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. అనర్హత కేసుకు సంబంధించి కాంగ్రెస్ తరపు న్యాయవాది వాదనలు ముగించారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment