Membership cancel
-
క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం రద్దు..
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులో దోషిగా తేలి 10 ఏళ్లు జైలు శిక్షపడిన లక్ష్యద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. లోక్‌సభ సెక్రటేరియట్ ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. మహమ్మద్ ఫైజల్ ఎన్సీపీ ఎంపీ. 2009లో కాంగ్రెస్ నేత మహమ్మద్ సాలిపై కొంతమంది సమూహంతో వెళ్లి దాడి చేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫైజల్ సహా మొత్తం 32 మందిపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఫైజల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది సెషన్స్ కోర్టు. బుధవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఆయన కేరళ హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం ఫైజల్ పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్‌సభ రద్దు చేసింది. చదవండి: మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు.. -
చిన్మయి వర్సెస్ రాధా రవి
‘మీటూ’ ఉద్యమం మన దేశంలోనూ ఊపందుకున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపించిన పేరు చిన్మయి. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి పాపులర్. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచారు. ధైర్యంగా నిలబడ్డారు. ‘మీటూ’ ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టారు. తమిళ పరిశ్రమలో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన ట్వీటర్ వేదికగా వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షికరుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిలో రాధారవి ఉన్నారు. సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్ ఆర్డర్ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్ కెరీర్ మందకొడిగా సాగుతోంది. తాజాగా ఈ నెల డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది. మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు చిన్మయి. విశేషం ఏంటంటే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్ యూనియన్ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?’ అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించారు. ‘‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ప్రస్తుతం చిన్మయి నామినేషన్ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎలాంటి నాటకీయత చోటు చేసుకుంటుంది? చిన్మయి వర్సెస్ రాధారవి.. గెలుపు ఎవరిది? అని తమిళ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
జెడ్పీటీసీ సభ్యత్వం రద్దు
రాయగడ : రాయగడ జిల్లా కాశీపూర్ ‘సి’జోన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు నీలకంఠజోడియా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ గుహపూనాంతపస్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడ జిల్లా పరిషత్‌లో 22స్థానాలు ఉండగా కాంగ్రెస్ 11స్థానాలు, బీజేడీ 7స్థానాలు, బీజేపీ 4స్థానాలు, గత మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందాయి. అయితే కాశీపూర్ జోన్లో ఓడిపోయిన బీజేడీ పార్టీకి చెందిన అభ్యర్థి పాపులర్ మజ్జి ఎన్నికల అనంతరం కాశీపూర్ ‘సి’ జోన్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నీలకంఠ జోడియాపై ఫిర్యాదు చేశారు. నీలకంఠ జోడియా ఆ దివాసీ కాదని ఎన్నికల నామినేషన్లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం అందజేశారంటూ జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జిల్లా మెజిస్ట్రేట్ ఈ నెల 21న విచారణ చేసి అనంతరం కాశీపూర్ ‘సి’జోన్ కాంగ్రెస్ అభ్యర్థి నీలకంఠజోడియా సభ్యత్వం చెల్లదని నిర్ధారించారు. నీలకంఠ జోడియా సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు నకిలీవని నిర్ధారించి ఆయన జిల్లా పరిషత్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తరఫున హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తానని ఈ సందర్భంగా నీలకంఠజోడియా మీడియాకు తెలియజేశారు. -
అమ్మ చేసింది తప్పు
... అని కమల్‌హాసన్ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అంటే మలయాళం నటీనటుల సంఘం అని అర్థం. గతేడాది నటి భావన కారులో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన వెనకాల నటుడు దిలీప్ హస్తం ఉందని భావన ఆరోపించారు. ఆమె ఫిర్యాదుని పరిశీలించి, పోలీసులు దిలీప్‌ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్‌పై బయటకు రావడం జరిగాయి. కాగా, ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు సభ్యత్వం ఇచ్చారు ఇటీవల ‘అమ్మ’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్‌లాల్. ఈ నిర్ణయంపై బాధితురాలు భావనతో సహా పలువురు కథానాయికలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ సభ్యత్వం ఎలా ఇస్తారు? అని ‘అమ్మ’ని నిలదీశారు. ఈ విషయం గురించి కమల్‌హాసన్ స్పందించారు. ‘‘చట్టపరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సభ్యత్వం ఇవ్వడం తప్పు. ఒకవేళ దిలీప్ని క్షమించాలనుకుంటే వ్యక్తిగతంగా చేయొచ్చు. అయితే ఓ అసోసియేషన్ తీసుకునే నిర్ణయానికి సభ్యులందరి ఆమోదం ఉండాలి. దిలీప్ని వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని ‘అమ్మ’లో ఉన్న పలువురు అంటున్నారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం సభ్యులందరితో చర్చించాలి. అలా కాకుండా అతనికి సభ్యత్వం ఇచ్చి, బాధిత నటికి అన్యాయం చేశారు. ఆర్టిస్టులందరి కలయికతో ఏర్పడేదే ఆర్టిస్ట్స్ అసోసియేషన్. అది సజావుగా సాగాలంటే అందరి సహకారం కావాలి’’ అన్నారు కమల్. చిత్రసీమలో లింగ వివక్ష గురించి మాట్లాడుతూ – ‘‘మిగతా చిత్రపరిశ్రమలతో పోల్చితే మలయాళంలో లింగ వివక్ష తక్కువ’’ అన్నారు కమల్. -
ముగిసిన వాదనలు.. రిజర్వ్‌లో తీర్పు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల అనర్హత కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. వేసవి సెలవుల అనంతరం తీర్పును వెల్లడించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ రద్దు తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణార్హతే లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ల అనర్హత కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసుకునే హక్కు లేదని అభిషేక్ తెలిపారు. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్పీల్ వేసే అర్హత లేదన్నారు. ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ మాత్రమే పిటిషన్ వేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్‌పై కోమటిరెడ్డి, సంపత్‌ల దాడి ఆరోపణలకు సంబంధించి వీడియోలు సమర్పించడంలో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. అనర్హత కేసుకు సంబంధించి కాంగ్రెస్ తరఫు న్యాయవాది వాదనలు ముగించగా, బుధవారం తదుపరి విచారణ కొనసాగించిన హైకోర్టు హైకోర్టు తీర్పు వెల్లడిని వాయిదా వేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం? -
వాళ్లిద్దరికీ మాత్రమే పిటిషన్ వేసే అర్హత ఉంది
హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి కేవలం అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిలకు మాత్రమే పిటిషన్ వేసే అర్హత ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి, ఎమ్మెల్యేల తరపున వాదిస్తున్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పష్టంగా పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనర్హత కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసుకునే హక్కు లేదని అభిషేక్ తెలిపారు. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్పీల్ వేసే అర్హత లేదన్నారు. ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ప్రకారం శాసనసభ మాత్రమే పిటిషన్ వేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పీకర్‌పై దాడికి సంబంధించి వీడియోలు సమర్పించడంతో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. అనర్హత కేసుకు సంబంధించి కాంగ్రెస్ తరపు న్యాయవాది వాదనలు ముగించారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.