
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై మంత్రి హరీశ్‌రావు దిగజారి వ్యవహరిస్తు న్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్ కుమార్ మంగళవారం విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు హరీశ్‌రావు లీకులు ఇవ్వడం సమంజసం కాదన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంపై మంత్రి నిజాల ను దాచి పెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై టీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ని వీడేది లేదని, టీఆర్‌ఎస్‌లో చేరేది లేదన్న విషయం అందరికీ తెలుసునన్నారు. మాజీమంత్రి డి.కె.అరుణ తనకు తల్లితో సమానమని, ఆమెతో ఎలాంటి విభేదాల్లేవని సంపత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment