![Harish rao talks with MLA Sampath - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/14/harish.jpg.webp?itok=jpxU-VdX)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో మంత్రి హరీశ్‌రావు దాదాపు 20 నిమిషాలకుపైగా మంతనాలు జరిపారు. శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే సంపత్‌కుమార్‌ను సభలో సోమవారం పక్కకు తీసుకెళ్లి తమ పార్టీలో చేరాలని హరీశ్ ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీలోనూ, ప్రజల్లోనూ పార్టీ పనితీరుపై అసంతృప్తి ఉన్నట్టుగా బహిరంగంగానే మాట్లాడిన సంపత్‌కుమార్‌తో మంత్రి హరీష్‌రావు చర్చించడం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా మారింది.
అయితే గత కొంతకాలంగా మంత్రి హరీష్‌రావుతో ఎమ్మెల్యే సంపత్ కుమార్ సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలోనూ జరుగుతోంది. ఈ సమయంలోనే ఏకంగా శాసనసభలోనే సంపత్ కుమార్‌తో హరీష్‌రావు ప్రత్యేక భేటీ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీకి చెందిన ముఖ్యనేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరడంతో, దీనికి అడ్డుకట్ట వేసేవిధంగా కాంగ్రెస్‌పార్టీకి చెందిన సంపత్‌కుమార్‌ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే హరీష్‌రావు పావులు కదుపుతున్నట్టుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment