![sampath kumar comments - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/15/fsdfa.jpg.webp?itok=wWTjk-GR)
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఉత్తమ్, అదే కేబినెట్‌లో హోంమంత్రిగా హరీశ్‌రావు ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, సభలో తనను హరీశ్‌రావు కలిస్తే ఇదే విషయం చెప్పానని సంపత్ వెల్లడించారు.
‘ఈ రోజు కూడా హరీశ్‌రావు నా దగ్గరకు వచ్చిండు. దొరా నిన్న నాతో మాట్లాడితే, ఈ రోజు పేపర్లలో వచ్చింది. ఈ రోజు కూడా మాట్లాడితే రేపు మళ్లీ వస్తదని హరీశ్‌తో చెప్పిన’అని వివరించారు. వచ్చే ఎన్నికల తర్వాత ఉత్తమ్ సీఎం అవుతారని, అదే కేబినెట్‌లో హోంమంత్రిగా ఉంటావని హరీశ్‌తోనే చెప్పినట్టుగా సంపత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment