
Surapanam Movie Trailer Released: సంపత్‌కుమార్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’. ప్రగ్యా నయన్ హీరోయిన్. మట్ట మధుయాదవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ –‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రాంతం నేపథ్యంలో మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి అంశాలతో పాటు మంచి ప్రేమకథ ‘సురాపానం’ లో ఉంటుంది. సంపత్‌కుమార్ ఏడేళ్లుగా మాతో ప్రయాణిస్తున్నాడు. ‘సురాపానం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు ఇండస్ట్రీలో ఉండవు. ఏ సినిమా ఎలాంటిది అనేది రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఇప్పటివరకు చూడని ఓ కొత్త కథను ‘సురాపానం’ చిత్రంలో చూస్తారు. ఫన్, ఎమోషన్, లవ్..ఇలా అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ప్రగ్యా నయన్. ఈ కార్యక్రమంలో మీసాల లక్ష్మణ్, ఫిష్ వెంకట్‌లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.
చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం
భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
Comments
Please login to add a commentAdd a comment