mamidi harikrishna
-
‘కేరాఫ్ రవీంద్రభారతి ’ హిట్ కావాలి: మామిడి హరికృష్ణ
‘తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోని ప్రతి కళాకారుడి యొక్క డ్రీమ్ డెస్టినేషన్ రవీంద్ర భారతి. గత 64 ఏళ్ల నుంచి ఓ సాహిత్య కేంద్రంగా విలసిల్లుతూ.. ఒక ప్రామాణిక ఆడిటోరియంగా ఉంది. అందుకనే ప్రతి కళాకారుడు తన జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ కళా ప్రదర్శన చేయాలని తపన పడతాడు. లక్షలాది కళాకారులకి వేదికగా నిలిచిన రవీంద్ర భారతి నేపథ్యంలో ‘కేరాఫ్ రవీంద్రభారతి ’సినిమా తెరకెక్కడం సంతోషంగా ఉంది’ అన్నారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాత గా , గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కేరాఫ్ రవీంద్రభారతి’.జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన,మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతి లో జరిగింది.తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు,మామిడి హరికృష్ణ ముఖ్య అదితి గా విచ్చేసి డైరెక్టర్ కి కథ ని అందించి, ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయగా, యువ డైరెక్టర్ నటుడు తల్లాడ సాయి కృష్ణ క్లాప్ కొట్టి టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. నవీన్ నాకు చాలా కాలంగా తెలుసు, చాలా కష్టపడే వ్యక్తి. తన మొదటి సినీమా శరపంజరం ఎలా కష్టపడి తీసారో ఆ శ్రమ నాకు తెలుసు. ఇప్పుడు ఓ మంచి కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.డైరెక్టర్ గట్టు నవీన్ మాట్లాడుతూ..మామిడి హరికృష్ణగారి చేతుల మీదుగా కేరాఫ్ రవీంద్ర భారతి సినిమా ప్రారంభోత్సవం జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమా ను నిర్మిస్తున్న టి. గణపతిరెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓ మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. ‘మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు జీవన్. ‘ఓ మంచి కథలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’ అని హీరోయిన్ నవీన అన్నారు. -
సమయం మారింది
ఓ గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే.. ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు ఎలా వ్యతిరేకత కనబరిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘శరపంజరం’. టి. గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని రెండో పాట ‘రావయ్యా నందనా రాజా నందన..’ పాటను ప్రముఖ నటి విజయశాంతి విడుదల చేశారు. మల్లిక్ ఎంవీకే స్వరపరచిన ఈ పాటను జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి, పాడారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఆనాడు దొరలు స్వార్థం కోసం ఆడవాళ్లని ఎలా వాడుకున్నారో తెలిసిన విషయమే. ఈనాటి దొర కూడా ఎలా చేస్తున్నాడో తెలిసిన విషయమే. సమయం మారింది కానీ వ్యక్తి మనస్తత్వం మారలేదనడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలుస్తుంది’’ అన్నారు. -
సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణకు వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రకటించింది. ‘తెలుగు సినిమాల్లో జానపద కథాంశాలు– అధ్యయనం’అనే అంశంపై డా.భట్టు రమేశ్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. 1896 నుంచి ఇప్పటివరకు 90 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో 8,600 పైగా చలనచిత్రాలు తెలుగులో నిర్మాణమయ్యాయని ఈ పరిశోధనలో పేర్కొన్నారు. 1938 ‘గులేబకావళి కథ’తో మొదలైన జానపద సినిమాలు ‘బాహుబలి’వరకు సినీరంగంలో చూపిన ప్రభావాన్ని చారిత్రిక దృష్టితో, సమగ్ర వ్యూహంతో పరిశోధించారని, అంతర్జాతీయంగా వివిధ దేశాల జానపద గాథలు సినిమాలుగా తెరకెక్కిన తీరు, వేర్వేరు భారతీయ భాషల్లో వచ్చిన సినిమాల్లో జానపద కథాంశాల తీరు, తెలుగు సినిమాల్లో జానపద లక్షణాలు, కథాంశాల విశ్లేషణను ఈ పరిశోధనలో అందించారని పరిశీలకులు తెలిపారు. ఇప్పటిదాకా తెలియని ఎన్నో అంశాలను ఈ పరిశోధన వెల్లడి చేసిందని, భవిష్యత్ పరిశోధనలకు రిఫరెన్స్ పుస్తకంగా నిలుస్తుందని హరికృష్ణను అభినందించారు. -
అలాంటి తేడాలు ఇండస్ట్రీలో ఉండవు: హీరోయిన్
Surapanam Movie Trailer Released: సంపత్‌కుమార్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’. ప్రగ్యా నయన్ హీరోయిన్. మట్ట మధుయాదవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ –‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రాంతం నేపథ్యంలో మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి అంశాలతో పాటు మంచి ప్రేమకథ ‘సురాపానం’ లో ఉంటుంది. సంపత్‌కుమార్ ఏడేళ్లుగా మాతో ప్రయాణిస్తున్నాడు. ‘సురాపానం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు ఇండస్ట్రీలో ఉండవు. ఏ సినిమా ఎలాంటిది అనేది రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఇప్పటివరకు చూడని ఓ కొత్త కథను ‘సురాపానం’ చిత్రంలో చూస్తారు. ఫన్, ఎమోషన్, లవ్..ఇలా అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ప్రగ్యా నయన్. ఈ కార్యక్రమంలో మీసాల లక్ష్మణ్, ఫిష్ వెంకట్‌లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
డిఫరెంట్ క్రైం థ్రిల్లర్‌గా 'కిరోసిన్'
కథలో దమ్ము ఉండాలి కానీ.. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ మూవీనైనా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు.అందుకే కొత్త దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా సరికొత్త కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న మరో చిత్రం ‘కిరోసిన్’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ కథ అందిస్తూ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసే బాధ్యతలు తీసుకున్నారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కిరోసిన్ కాన్సెప్ట్ పోస్టర్ లాంచ్ చేశారు. తెలంగాణ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హరికృష్ణ మామిడి చేతుల మీదుగా ఈ పోస్టర్ విడుదల చేశారు.పోస్టర్ చూస్తే పోలీస్ డ్రెస్‌లో కనిపిస్తున్న హీరో, పోలీస్ లైన్ డు నాట్ క్రాస్ అనే ట్యాగ్ కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా ద్వారా ఏదో కొత్త విషయం చెప్పబోతున్నారని స్పష్టమవుతోంది. -
నిజానికి దగ్గరగా...
‘గెటప్’ శీను, అంకితా కరత్ జంటగా కృష్ణమాచారి దర్శకత్వంలో ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్’. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సాగర్ కె. చంద్ర క్లాప్ ఇచ్చారు. వేణు ఉడుగుల, సుధాకర్ చెరుకూరి, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్క్రిప్ట్‌ను కృష్ణమాచారికి అందించారు. సూడో రియలిజమ్ జానర్లో ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ‘కమర్షియల్ హంగులకు దూరంగా, వాస్తవికకు దగ్గరగా మా సినిమా ఉంటుంది’ అన్నారు కృష్ణమాచారి. ‘డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు ప్రశాంత్ రెడ్డి. -
మాతృభాషకు ప్రాధాన్యం తెలుగు వికీపీడియా సదస్సు–2020లో వక్తలు
రాయదుర్గం: విజ్ఞానమంతా ఆంగ్లంలోనే నిక్షిప్తమై ఉందని, దాన్ని అనువదించి భవిష్యత్తు తరాలకు అందించాలంటే మాతృభాష తెలుగుకు ప్రాధాన్యమివ్వాలని వికీపీడియా సదస్సు–2020లో వక్తలు అభిప్రాయపడ్డారు. వికీపీడియాలో ప్రస్తుతం దాదాపు 72 వేల వరకూ ఉన్న వ్యాసాలను ఏడు లక్షలకు పెంచాలని సదస్సులో తీర్మానించారు. గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ–హైదరాబాద్‌లోని కోహ్లీ సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ (కేసీఐఎస్) ఆడిటోరియంలో శనివారం ‘ప్రాజెక్ట్ తెలుగు వికీ’ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొని మాట్లాడుతూ.. వికీపీడియాలో వ్యాసాలు పెంచడం కోసం ప్రత్యేక యంగ్ బ్రిగేడ్‌ను తయారు చేసేందుకు ట్రిపుల్ఐటీతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సాంస్కృతిక శాఖ ద్వారా అనేక చారిత్రక, భాషా, పండుగల కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటుతున్నామని పేర్కొన్నారు. వికీపీడియాలోనే కాకుండా ఎక్కడైనా మాట్లాడే భాష, రాసే భాష వేర్వేరుగా ఉండాలని అనుకుంటారనీ, కానీ మాట్లాడే భాషలోనే రాయడం మంచిదని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక విజ్ఞానం పెరగడంతో మనిషి మేధస్సు పెరిగినా మనస్సు మాత్రం పెరగడం లేదని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం డిజిటల్ లిటరసీ సమస్య ఉందని, వికీపీడియాలో ఏడు మిలియన్ల ఇంగ్లిష్ వ్యాసాలుంటే అవి అమెరికా, యూరోప్ వాళ్లు రాసినవేనని ట్రిపుల్ఐటీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. వికీపీడియాపై ఉచిత శిక్షణ ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో ఉచితంగా ప్రతీ శుక్రవారం వికీథాన్ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, ప్రతీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వికీపీడియాపై శిక్షణ నిర్వహిస్తున్నామని ట్రిపుల్ఐటీ ఆర్ అండ్ డీ మాజీ డీన్ ప్రొఫెసర్ వాసుదేవవర్మ చెప్పారు. తెలుగు వికీపీడియాలో వ్యాసాల సంఖ్య గణనీయంగా òపెంచేందుకు హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ఐటీలో ప్రాజెక్టు తెలుగు వికీ పేరిట ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజేనారాయణన్ తెలిపారు. ఈ సదస్సులో ఇంకా ట్రిపుల్ఐటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీనిరాజు, వెంకటేశ్వర్లు, దిలీప్‌కొణతం, ప్రవీణ్ గరిమెల్ల, ప్రాజెక్టు తెలుగు వికీ బృందం, పలువురు మేధావులు, ట్రిపుల్ఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
48 అవర్స్ చాలెంజ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ‘48 గంటల సినిమా తయారీ పోటీ’లను వైభవంగా నిర్వహించేందుకు గాను విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఒక షార్ట్‌ఫిల్మ్ తీయాలంటే మామూలుగా నిడివిని బట్టి తక్కువలో తక్కువ నెలరోజులైనా పడుతుంది. కానీ 48 గంటల్లో స్క్రిప్టు రాయడం, షూటింగ్, ఎడిటింగ్ లాంటివి పూర్తి చేసి సినిమా తీయడానికి తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ కొత్త ఒరవడికి తెరలేపింది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఉన్న పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ కేంద్రంగా సినీవారం, సండే సినిమా అనే కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జీవితం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, ఉత్తమ విదేశీ సినిమాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఫిల్మోత్సవం.. : గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాది జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవతరణ ఫిల్మోత్సవం పేరిట షార్ట్ ఫిలిం పోటీల ను నిర్వహిస్తున్నారు. ఈసారి అవతరణ ఫిల్మోత్స వాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. సినీ నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘48 అవర్స్ ఫిల్మ్ మేకింగ్ చాలెంజ్’ని తెలంగాణ ఫిల్మ్ మేకర్స్‌కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ మేకింగ్ మారథాన్ మే 24 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మొదలై 26 (ఆదివారం) రాత్రి 7 గంటలకు ముగియనుంది. శుక్రవారం సాయంత్రం భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించే థీమ్, ప్రాప్, డైలాగ్ లేదా క్యారెక్టర్ని వాడి 4 నుంచి 8 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయాల్సి ఉంటుంది. మే 27న పోటీదారుల జాబితాను వెల్లడిస్తారు. విజేతలను జూన్ 3న రవీంద్రభారతిలో జరిగే వేడుకలో ప్రకటిస్తారు. ప్రతిభ చూపేందుకు మంచి అవకాశం: తమ ప్రతిభను నిరూపించుకునేందుకు గాను ఔత్సాహిక సినిమా దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది ఒక గొప్ప అవకాశం. దీన్ని ఆసక్తి ఉన్న యువత అందరూ వినియోగించుకోవాలి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, తమ ప్రతిభను మెరుగు పరచడానికి సినీవారం, సండే సినిమా, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించాం. తద్వారా తమ ప్రతిభకు వారు మెరుగులు దిద్దుకునే అవకాశం కలుగుతుంది. ఔత్సాహిక సినిమా దర్శకులు 91 8919997465 నంబర్‌ను సంప్రదించవచ్చు. - మామిడి హరికృష్ణ,భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు -
రాష్ట్రాన్ని కళలకు కేంద్రంగా మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నమ్మకంతో తనకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నూతన తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బి.శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలోని కళాభవన్‌లో భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయం పైఅంతస్తులో ఏర్పాటుచేసిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయాన్ని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. శివకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ నాటక, సంగీత కళలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు అహోరాత్రులు శ్రమిస్తానని తెలిపారు. గ్రామాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారని.. వారికి రవీంద్రభారతి లాంటి వేదికపై ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణను కళలకు కేంద్రంగా మారుస్తామని హామీఇచ్చారు. జీవితాంతం కళలకు సేవ చేస్తానని.. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి పేరు తెస్తానని తెలిపారు. పేద కళాకారులకు నాటక అభినయం ఉన్నవారికి చేయూత ఇస్తామని చెప్పారు. కళాకారులకు ఆర్థిక సాయం, పల్లె కళాకారులకు రవీంద్రభారతిలో ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. -
మొగిలయ్యను ఆదుకుంటాం
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్యను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వెల్లడించారు. సాక్షిలో ‘కిన్నెర మెట్లు.. బతుకు పాట్లు’ శీర్షికన మంగళ వారం మొగిలయ్య దీనగాథ ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన హరికృష్ణ బుధవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కిన్నెర వాయిద్యం కళను వెలికితీయడంతోపాటు మొగిలయ్యను తెలంగాణ ప్రభుత్వం ఆదరించిందని గుర్తుచేశారు. మొగిలయ్యకు కళాకారుల కోటాలో నెలనెలా పింఛన్ అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కళాకారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్య తాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు -
తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకా రుడు రవిశంకర్ రూపొందించగా.. సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఎం.వి.రమణారెడ్డి రూపొందించారు. మంగళవారం ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలో.. కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో పొందుపరిచారు. లోగో పై భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రించారు. మన తెలంగాణము తెలుగు మాగాణము అనే వాక్యం కనిపిస్తుంది. సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పుటలను నీటి అలలుగా చిత్రించారు. లోగో పైభాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా పొందుపరిచారు. లోగో మధ్యలో పాల్కూరి సోమనాథుడి పద్యభాగం ‘సరసమై బరగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని ప్రముఖంగా చేర్చారు. -
1500 మందితో రిహార్సల్స్
సాక్షి,సిటీబ్యూరో: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం ఎల్బీస్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. గురువారం 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడి రిహార్సల్స్ నిర్వహించారు. ఓనం తరహాలో ఒకే చోట 10వేల మంది మహిళలతో బతుకమ్మ ఆడించి గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించాలని నిర్ణయించారు. 9న సద్దుల బతుకమ్మ సందర్భంగా 10 వేలు, అంతకంటే ఎక్కువ మంది మహిళలను ఒక్కచోట చేర్చాలని పర్యాటక, సాంస్కృతిక శాఖలు నిర్ణయించాయి. టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జడ్ ఛోంగ్తూ, అధికారులు దినకరబాబు, సాంస్కృతికడైరెక్టర్ మామిడి హరికృష్ణ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
తెలంగాణ జానపద కళల ఖజానా
రాష్ట్ర భాషా సాంస్కృతికSశాఖ డైరెక్టర్ హరికృష్ణ ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు హన్మకొండ కల్చరల్ : తెలంగాణ జానపద కళలకు ఖజానా వంటిదని రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జానపద కళలకు, కళాకారులకు సముచిత స్థానం కల్పించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపదుల కళాకారుల సంఘం వరంగల్ అధ్వర్వంలో గురువా రం ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం హన్మకొండ వేయిస్తంభాల దేవాలయం నుంచి 500 మంది కళాకారులు మహార్యాలీ నిర్వహించారు. అలాగే పలు ప్రదర్శనలు చేపట్టి ఆకట్టుకున్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ సాయంత్రం 7 గంటలకు జరి గిన సమావేశంలో మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని తెలి పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాౖటెన తర్వాత తెలంగాణ కళలు వికసిస్తున్నాయన్నారు. ప్రపంచమంతటా ఒక రోజు మాత్రమే జానపద దినోత్సవాన్ని జరుపుకుంటుండగా.. తెలంగాణలో పది రోజుల పాటు సంబురాలు జరుపుకోవడం చరిత్రలో మొదటి సారి అన్నారు. నిరాదరణకు గురవుతున్న కళాకారులు, కళాకారుల వాయిద్యాలు మళ్లీ మోగుతున్నాయన్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్, గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వడంతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంత్రులు రసమయి బాలకిషన్, అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశం, ప్రభుత్వ సలహాదారు రమణా చారి కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ డీడీ డీఎస్ జగన్ మాట్లాడుతూ జిల్లాలో 96 మంది సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారన్నారు. అనంతరం పలువురు కళాకారులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు, జిల్లా సాంస్కృతిక మండలి సభ్యుడు, జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బూర విద్యాసాగర్, అధ్యక్షుడు గడ్డం సుధాకర్, వంగSశ్రీనివాస్, చుంచు లింగయ్య, రాష్ట్ర ప్రతినిధులు సింగారపు జనార్దన్, యాదగిరి ప్రసాద్, అరూరి కుమార్, రామస్వామి, టీఎస్ఎస్ కోఆర్డినేటర్ దారా దేవేందర్, కవి అన్వర్, సినీ దర్శకుడు సంగ కుమార్, మేజిషియన్ మార్త రవి, మిమిక్రీ కళాకారులు మనోజ్‌కుమార్, ఆలేటి శ్యామ్, వరంగల్ శ్రీనివాస్, తదితరలు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పండగగా బతుకమ్మ
♦ నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ.10లక్షలు: రమణాచారి ♦ జిల్లాకొక ‘బతుకమ్మ పల్లె’ సాక్షి, హైదరాబాద్: బతుకమ్మను జాతీయ స్థాయి పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. మంగళవారం రాత్రి సచివాలయంలో అన్నిజిల్లాల కలెక్టర్లు, జేసీలు, డీపీఆర్‌ఓలతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బతుకమ్మ పం డుగను నిర్వహించేందుకు ఒక్కో జిల్లాకు రూ.10లక్షలు కేటాయిస్తున్నామని తెలి పారు. ‘‘ఈసారి బతుకమ్మ పండుగకు చాలా విశిష్టత ఉంది.గతంలోలా కేవలం పూల పండుగ మాదిరిగా కాకుండా మహిళలు,బాలికలు, ప్రకృతి, చెరువు, పండుగ... ఈ ఐదింటి సమ్మేళనంగా జరుపుకోవాలి. బతుకమ్మకు విస్తృత వ్యాప్తి కల్పించడమే దీని ఉద్దేశం’’ అని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక ‘బతుకమ్మ పల్లె’ను గుర్తించాలని ఆదేశించారు. విదేశీ యాత్రికులు ఆ గ్రామాలను సందర్శించి ప్రజల ఇళ్లల్లోనే అతిథులుగా తొమ్మిది రోజులపాటు ఉండి సంస్కృతీ సంప్రదాయాలను నేరుగా తెలుసుకుంటారని చెప్పారు. ‘ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం, షార్ట్ఫిల్మ్లపై రాష్ట్రస్థాయి పోటీలు కూడా ఉంటాయి. 21న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ముగింపు ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా చేపట్టే పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా మహిళలు, మహిళా కళాకారులు మాత్రమే పాల్గొంటారు.శకటాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులిస్తాం’ అని వెల్లడించారు. జిల్లాల్లో మహిళా షాపింగ్ ఫెస్టివల్ కూడా నిర్వహించాలన్నారు. -
ఉగాది పురస్కారాలకు నగదు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఉగాది పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇకపై ఈ పురస్కారం కింద రూ. 10,116 అందించనుంది. ఇప్పటివరకు రూ. 5,116 ఇస్తూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో ఈ మొత్తాన్ని పెంచితే బాగుంటుందంటూ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పెంచిన మొత్తాన్ని ఈ ఉగాది నుంచే పురస్కార గ్రహీతలకు అందజేయనుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు జారీ అయింది. -
సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మామిడి హరికృష్ణ నియమితులుకానున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న రాళ్లబండి కవితాప్రసాద్ తిరిగి సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ కానున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మామిడి హరికృష్ణను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరికృష్ణ ప్రస్తుతం కో- ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాను సాంఘిక సంక్షేమ శాఖకు తిరిగి వెళ్తున్నట్లు కవితాప్రసాద్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు.