సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ! | mamidi harikrishna appointed telangana cultural director | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!

Published Thu, Oct 16 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!

సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మామిడి హరికృష్ణ నియమితులుకానున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న రాళ్లబండి కవితాప్రసాద్ తిరిగి సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ కానున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు రానున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మామిడి హరికృష్ణను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరికృష్ణ ప్రస్తుతం కో- ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాను సాంఘిక సంక్షేమ శాఖకు తిరిగి వెళ్తున్నట్లు కవితాప్రసాద్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement