కథలో దమ్ము ఉండాలి కానీ.. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ మూవీనైనా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు.అందుకే కొత్త దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా సరికొత్త కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న మరో చిత్రం ‘కిరోసిన్’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ కథ అందిస్తూ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసే బాధ్యతలు తీసుకున్నారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కిరోసిన్ కాన్సెప్ట్ పోస్టర్ లాంచ్ చేశారు. తెలంగాణ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హరికృష్ణ మామిడి చేతుల మీదుగా ఈ పోస్టర్ విడుదల చేశారు.పోస్టర్ చూస్తే పోలీస్ డ్రెస్‌లో కనిపిస్తున్న హీరో, పోలీస్ లైన్ డు నాట్ క్రాస్ అనే ట్యాగ్ కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా ద్వారా ఏదో కొత్త విషయం చెప్పబోతున్నారని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment