ఉగాది పురస్కారాలకు నగదు పెంపు | cash raised for ugadi puraskaralu | Sakshi
Sakshi News home page

ఉగాది పురస్కారాలకు నగదు పెంపు

Published Wed, Mar 18 2015 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

cash raised for ugadi puraskaralu

సాక్షి, హైదరాబాద్: ఉగాది పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇకపై ఈ పురస్కారం కింద రూ. 10,116 అందించనుంది. ఇప్పటివరకు రూ. 5,116 ఇస్తూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో ఈ మొత్తాన్ని పెంచితే బాగుంటుందంటూ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పెంచిన మొత్తాన్ని ఈ ఉగాది నుంచే పురస్కార గ్రహీతలకు అందజేయనుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు జారీ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement