సాక్షి, హైదరాబాద్: ‘పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో యురేనియం తవ్వకాలకు ఏం సంబంధం? జనసేన బ్యానర్‌పై స్టార్ హోటల్‌లో నిర్వహించిన సమావేశానికి 130 సంవత్సరా ల చరిత్ర కలిగిన పార్టీ ప్రతినిధులుగా మనం వెళ్లడం ఏంటి? టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీహెచ్‌లాంటి నాయకులు అక్కడకు వెళ్లి 4 గంటలు కూర్చోవడం ఏంటి? మన బలం తో పవన్‌ను హీరో చేయడమెందుకు? అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ కాంగ్రెస్ ముఖ్య నేతలను నిలదీశారు. పవన్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడంపై మంగళవారం జరిగిన టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వాడివేడిగానే చర్చ జరిగింది. తవ్వకాలపై ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిశామని, మాజీ ఎమ్మెల్యే వంశీ పోరాటం చేస్తున్నారని, ఉత్తమ్ సీఎంకు లేఖ రాశారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా కల్పించుకొని దీన్ని పునరావృతం కానివ్వమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment