Round Table Meetings
-
18న ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నా
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనకు పది రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది సోమవారం నుంచి తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు, 19న మండల కేంద్రాల్లో రాజకీయపార్టీలు, ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ (సీఐటీయూ, ఏఐటీయూసీ, టీజీకేబీయూ, ఐఎఫ్‌టీయూలతో కూడిన) శనివారం నిర్ణయించింది. అలాగే 20న సమ్మె పరిష్కరించాలంటూ అన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని, 21న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని తీర్మానించింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 21 తర్వాత నీరు, కరెంట్, వీధి దీపాలు సహా అన్ని అత్యవసర సేవలు నిలిపేస్తామని హెచ్చరించింది. డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఈనెల 6న ప్రారంభించిన సమ్మె నేటికి పదో రోజుకు చేరనుంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వివిధ కేటగిరీల్లో 50 వేల మంది పనిచేస్తున్నారు. సిబ్బందిని పర్మినెంట్ చేయడంతోపాటు పీఆర్సీలో నిర్ణయించినట్టు రూ.19 వేలు కనీస బేసిక్ పే ఇవ్వాలని, అప్పటిదాకా స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎల్రక్టీషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పది రోజులుగా సమ్మె చేస్తున్నా జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవకపోగా సమ్మెను నీరుగార్చేందుకు పోటీ కార్మికులను నియమించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్ ఆరోపించారు. -
అనంతపురంలో వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం
-
పాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): పాలన వికేంద్రీకరణపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత,ఎమ్మెల్యేలు, మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మేధావులు చెప్పిన అంశాలను పక్కనపెట్టి.. రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 6లో ప్రస్తావించిన అనేక అంశాలు పరిశీలించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గౌరవిస్తే బాగుండేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మేధావులు చెప్పిన అంశాలను పక్కనపెట్టి అమరావతి రాజధానిగా చంద్రబాబు పెట్టారన్నారు. రాజధాని అత్యంత ప్రాధాన్యత అంశం.. అందుకే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని రాజధాని ఏర్పాటు చేయాల్సిందని కమిషన్ చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం: మార్గాని భరత్ వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. అమరావతి కోసం లక్ష కోట్లు బడ్జెట్ కావాలన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష. రాజాధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం అని ఎంపీ అన్నారు. -
మూడు రాజధానులకు మద్దతుగా పాదయాత్ర చేద్దాం : ప్రొ.విజయకుమార్
-
‘వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’
సాక్షి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా విశాఖను ప్రతిఒక్కరు స్వాగతించాలని సీనియర్ జర్నలిస్టురమణమూర్తి ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. పరిపాలన రాజధాని ఏర్పాటును బలపరచడంతో పాటు త్వరితగతిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని విశాఖ ఆంధ్రయూనివర్శిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు ప్రొఫెసర్లు డాక్టరు ప్రేమానందం, డాక్టర్ సరున్ రాజు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి. కాంతరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు రమణమూర్తి మాట్లాడుతూ.. పరిపాలన రాజధాని ఏర్పాటుతో విశాఖకు, ఉత్తరాంధ్రకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. కాగా అమరావతి రైతులు చేసిన త్యాగమేమిటో ప్రజలకి చెప్పాలన్నారు. భూములతో వ్యాపారం చేసి త్యాగాలు చేశామనడం సరికాదన్నారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి వేలాది మంది భూములిచ్చి త్యాగాలు చేశారని, ఉత్తరాంధ్రకు మేలు జరుగే పరిపాలన రాజధాని నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. విశాఖ రాజధానిగా మారితే ఉద్యోగ, ఉపాధి కల్పన పెరిగి నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆయన వివరించారు. ఇక ప్రొఫెసర్ ప్రేమానందం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేధావులుగా మనమంతా మద్దతు పలకాలన్నారు. అధికార వికేంధ్రీకరణ ద్వారనే రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఒక వర్గానికి మేలు చేయడం కోసమే అమరావతి పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ సరున్ రాజు మాట్లాడుతూ: విశాఖలో పరిపాలన రాజధానిని స్వాగతించాలన్నారు. విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకునేవాళ్లంతా చరిత్రహీనులగా మిగిలిపోతారన్నారు. వెనుకుబాటుకు గురైన ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ఒక వరం లాంటిదని, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని బలపరుస్తున్నామని ఆయన తెలిపారు. -
ప్రభుత్వంపై బురదజల్లేందుకే సమావేశాలు
సాక్షి,అమరావతి: రాష్ట్ర ప్రజలను గ్రాఫిక్స్‌తో ఐదేళ్లు వంచించిన చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి రాజధానిపై అపోహలు సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. బాబు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రాజకీయ పక్షాలు పెద్దగా స్పందించినట్లు కన్పించలేదన్నారు. రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని, ఇతర పార్టీలను మాట మాత్రం అడగని చంద్రబాబు ఇప్పుడు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాబుకు అప్పుడు కన్పించని ప్రతిపక్షాలు ఓడిన తరువాత కన్పిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. రాజధానిపై అపోహలు సృష్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని పేరు ఎత్తితే బాబు సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటారని, బాబుకు, ఆయన వర్గానికి మాత్రం రాజధాని బాగా సంపద సృష్టించిపెట్టిందన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన స్కాములు అన్నీఇన్నీ కావన్నారు. ఇవన్నీ కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వం బయటపెట్టే ప్రయత్నంలో ఉందన్నారు. దీంతో బాబుకు, ఆయన బినామీలు తమ దోపిడీ బయటపడుతుందనే భయంతో రాజధాని పర్యటనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించినా జ్ఞానోదయం కాలేదన్నారు. రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు పక్క రాష్ట్రాలకు ఆరోగ్య శ్రీ విస్తరించామన్నారు. ప్రజాప్రయోజనాల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తున్నారే తప్ప మరే ప్రత్యేక అంశం లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సార్థక నామధేయుడు పవన్ కల్యాణ్ పవన్ పదిరోజుల నుంచి మతం, కులం, ఉల్లిపాయలు గురించి ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. ఆయన సార్థకనామధేయుడని, పేరులోని రెండో భాగం కల్యాణంకు చాలా న్యాయం చేశాడని వ్యాఖ్యానించారు. బాప్టిస్టు మతం తీసుకున్నానని పేర్కొన్న పవన్ తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. -
పవన్‌కల్యాణ్ మీటింగ్‌కు మనమెందుకు?: సంపత్
సాక్షి, హైదరాబాద్: ‘పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో యురేనియం తవ్వకాలకు ఏం సంబంధం? జనసేన బ్యానర్‌పై స్టార్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి 130 సంవత్సరా ల చరిత్ర కలిగిన పార్టీ ప్రతినిధులుగా మనం వెళ్లడం ఏంటి? టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీహెచ్‌లాంటి నాయకులు అక్కడకు వెళ్లి 4 గంటలు కూర్చోవడం ఏంటి? మన బలం తో పవన్‌ను హీరో చేయడమెందుకు? అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ కాంగ్రెస్ ముఖ్య నేతలను నిలదీశారు. పవన్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడంపై మంగళవారం జరిగిన టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వాడివేడిగానే చర్చ జరిగింది. తవ్వకాలపై ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిశామని, మాజీ ఎమ్మెల్యే వంశీ పోరాటం చేస్తున్నారని, ఉత్తమ్ సీఎంకు లేఖ రాశారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కల్పించుకొని దీన్ని పునరావృతం కానివ్వమని అన్నారు. -
ఉక్కు కోసం ఉద్యమిద్దాం
సాక్షి, కడప కార్పొరేషన్ : కడప ఉక్కు పరిశ్రమ బీజేపీ ప్రభుత్వం వేసే భిక్ష కాదని, పార్లమెంటులో చేసిన చట్టమని, హక్కుదారులు కావాలంటే ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని అఖిపక్షనేతలు పిలుపునిచ్చారు. కడపలోని వైఎస్ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు రావాలని వైఎస్ఆర్ కలలు కనేవారన్నారు. ఈ మేరకే ఆయన హయాంలో జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారన్నారు. బ్రాహ్మణి యాజమాన్యం రూ.1800కోట్లు ఖర్చు చేసి పరిశ్రమ ఏర్పాటు చేసిందని, రూ.1200కోట్లు ఖర్చు చేస్తే అది పూర్తవుతుందన్నారు. అయితే దురదృష్టవశాత్తు మొదటి నుంచి జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. ఉక్కు పరిశ్రమను విభజన చట్టంలో పొందుపరిచారని, పరిశ్రమ స్థాపనకు కావలసిన ఎయిర్‌పోర్టు, రైల్వే, విద్యుత్, నీరు, వనరులు వంటి అన్ని అనుకూలతలు ఇక్కడ ఉన్నా అది రాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీయేనని ధ్వజమెత్తారు. నాలుగేళ్లపాటు కలిసి పోరాడుదామంటే ముందుకు రాని టీడీపీకి ఈరోజు ప్రతిపక్షాలు కనిపించాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి లక్షల కోట్లు పచ్చచొక్కాల వారికి పంచేసి పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు, ఉక్కు పరిశ్రమ వల్లే విశాఖపట్నం అంతపెద్ద నగరంగా అభివృద్ధి చెంది, 42 శాతం ఆదాయాన్నిస్తోందన్నారు. కడపకు ఉక్కు పరిశ్రమ వస్తే అదే తరహాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అందరూ ఐక్యంగా సైనికుల వలే పోరాడి సాధించాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ సభ్యుడు బండి జకరయ్య మాట్లాడుతూ జెండాలు పక్కనబెట్టి ఉక్కు పరిశ్రమే ఏకైక ఎజెండాగా పోరాడాలన్నారు. నాలుగేళ్లు ఉక్కు పరిశ్రమపై పట్టించుకోని టీడీపీ ఈనాడు అఖిలపక్షాన్ని పిలవడం సిగ్గుచేటన్నారు. బీఎస్పీ నాయకులు గుర్రప్ప మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకు అన్ని వర్గాలను ఏకం చేసి పోరాడాలని సూచించారు. జనసేన నాయకులు చలపతి మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఇన్నాళ్లు చేసిన పోరాటం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యిందన్నారు. లీగల్ సెల్ అథారిటీ కన్వీనర్ గుర్రప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్ దూరదృష్టితో ఉక్కు పరిశ్రమ స్థాపించారని, రెండు పత్రికలు మాత్రం బ్రాహ్మణి మూతపడే వరకూ విశ్రమించకుండా కథనాలు రాశాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ జల్లికట్టు, తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించాలని చెప్పారు. మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకోసం ప్రాణ త్యాగానికైనా, అరెస్టులు కావడానికైనా, జైలుకెళ్లడానికైనా సిద్దమేనని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఐఎన్ సుబ్బమ్మ, స్టీల్‌ప్లాంటు సాధన సమితి నాయకులు సీఆర్వీ ప్రసాద్, రైతు స్వరాజ్య వేదిక శివారెడ్డి, కిషోర్ కుమార్, చల్లా రాజశేఖర్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, టి. సునీల్, విజయ్‌కుమార్, ఖాజా, షఫీ, పత్తి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని.. బీజేపీ కళ్లున్న కబోదిలా వ్యవహరించింది. నాలుగేళ్లు కమిటీల పేరుతో కాలయాపన చేసి ఈనాడు సాధ్యం కాదని చెప్పడం దారుణం. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కావలసినంత భూమి, నీరు, రైల్వేలైన్, ఎయిర్‌పోర్టు, ముడిసరుకు ఉందని.. అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని ఉన్నట్లు పరిస్థితి తయారైంది. ఉక్కు పరిశ్రమ సాధనకు చేసే ఉద్యమానికి కాంగ్రెస్ పూర్తి సహకారం ఇస్తుంది. – నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు ఉక్కు ఉద్యమానికి ఏపీయూడబ్లు్యజే మద్దతు... కడపలో ఉక్కు పరిశ్రమ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేసే ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్లు్యజే) పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి తెలిపారు. విభజనతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన చట్టంలో ఉన్న ఉక్కు పరిశ్రమను ఇన్నాళ్లు ఇస్తాం, ఇస్తాం అని ఊరించిన కేంద్రం ఒక్కసారిగా సాధ్యం కాదని చెప్పడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ఎస్ రెడ్డి, జయపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి.. ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి. అందుకోసం విస్తృత ప్రచారం చేయాలి. ద్రోహం చేసిన వారు, ఆ ద్రోహానికి సహకరించిన వారు కూడా దోషులే. అన్యాయం చేసేవారితో చేతులు కలపొద్దని, ద్రోహులను ఏకాకిని చేసి ఉక్కు పరిశ్రమ ఒక్కటే ఏకైక ఎజెండాగా పోరాడాలి. అమరావతికి భూమిపూజ చేసేటప్పుడు మట్టి, నీళ్లు తెచ్చి మొఖాన కొట్టిన మోడీ, ఈనాడు రాయలసీమ ఆశలపై నీళ్లు చల్లారు. – ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి -
‘ఏన్డీఏ నుంచి ఆయన బయటకు రావాలి’
సాక్షి, విజయవాడ : మంత్రి పదవులు వదులుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.రామకృష్ణ ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చి ప్రత్యేక హోదాకోసం పోరాడాలన్నారు. హోదా విషయంపై విజయవాడలో ఈ నెల 19న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయలేదన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపినా, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడకపోవడం బాధాకరం అన్నారు. బీజేపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్ రాజకీయ నిర్ణయం అనడం సిగ్గుచేటని విమర్శించారు. ఏనాడు రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు రెండో రాజధాని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఉద్యమ పిడికిలి
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ప్రత్యేక హోదా కోసం మరో ఉద్యమం ప్రారంభమయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని ఇటీ వల వచ్చిన వార్తల నేపథ్యంలో పశ్చిమ ప్రజలు రగిలిపోతున్నారు. పోరాట పథంలో కదులుతున్నారు. రాష్ట్రంలోనే జిల్లాలో మొదటి సారిగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు తమ పోరాటాలకు కార్యాచరణ రూపొందించుకున్నాయి. వివిధ ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఐక్య పోరాటాలకు సిద్ధమౌతున్నాయి. పలు ప్రజా సంఘాలు ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, బస్సు యాత్రలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమ వంతు కృషి చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి పేరిట నూతన వేదిక ద్వారా అన్ని వర్గాలనూ కలుపుకుని ఆందోళనాపథంలో పయనిస్తున్నాయి. సమైక్య రాష్ట్రం కోసం అన్ని వర్గాలూ ఏకమై ఆందోళనలు చేసిన రోజులు మళ్లీ గుర్తుకు వచ్చేలా ప్రజల్లో ప్రత్యేక హోదాపై అవగాహన కలిగించడానికి కృషి చేస్తున్నాయి. ఆత్మాహుతితో పెరిగిన పట్టుదల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేస్తూ తిరుపతిలో శనివారం మునికామకోటి(41) ఆత్మహుతికి పాల్పడడం పలువురిని కలచివేసింది. హోదా కోసం మరో మహోద్యమం చేయాలనే పట్టుదలను వివిధ వర్గాలలో రేపింది. ఇప్పటికే పోరుబాట పట్టిన సంఘాలు ఈ దుర్ఘటన నేపథ్యంలో అంతా ఏకమై ఆందోళనలకు దిగడానికి సమాయత్తమవుతున్నాయి.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా సాధన ఒక్కటే లక్ష్యంగా పోరాటమార్గాన పయనించక తప్పని పరిస్థితి ఏర్పడింది. జగన్ ఆందోళనకు వివిధ వర్గాల మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం కట్టుబడి పనిచేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలను ఆయన వైపు ఆకర్షింపచేసింది. జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజల కోసం తమ పార్టీ ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ప్రత్యేక హోదా సాధన కోసం భారీ ఆందోళన తలపెట్టారు. ఈ ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు ఉవ్వెత్తున వచ్చి పడింది. వైఎస్సార్ సీపీ శ్రేణులతోపాటు వివిధ వర్గాల వారు ఈ ఆందోళనలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఢిల్లీ వెళ్లారు. ఈ ఆందోళనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం వస్తుందనే నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రకటించి ఆ మేరకు కార్యాచరణకు దిగుతున్నాయి. ప్రత్యేక హోదా సాధనపై కొంతమంది నాయకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలి మిత్రపక్షమైనా కేంద్రంలోని బీజేపీ నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే బయటకు రావాలి. చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేవాడు. అధికారంలోకి వచ్చిన తరువాత జపాన్, సింగపూర్ అంటూ విదేశీ ప్రయాణాలపై చూపిన శ్రద్ధలో ఒక్క శాతమైనా ఢిల్లీలో కూర్చుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంపై చూపి ఉంటే ఈ పాటికి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన విడుదల చేసి ఉండేది. కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి