‘ఏన్డీఏ నుంచి ఆయన బయటకు రావాలి’ | CPI State Secretary Ramakrishna Says Chandrababu Should Come Out Of The NDA | Sakshi
Sakshi News home page

‘ఏన్డీఏ నుంచి ఆయన బయటకు రావాలి’

Published Tue, Mar 13 2018 7:07 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

CPI State Secretary Ramakrishna Says Chandrababu Should Come Out Of The NDA - Sakshi

ఎ.రామకృష్ణ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయవాడ : మంత్రి పదవులు వదులుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.రామకృష్ణ ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చి ప్రత్యేక హోదాకోసం పోరాడాలన్నారు. హోదా విషయంపై  విజయవాడలో ఈ నెల 19న రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపినా, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడకపోవడం బాధాకరం అన్నారు. బీజేపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రైల్వే జోన్ రాజకీయ నిర్ణయం అనడం సిగ్గుచేటని విమర్శించారు. ఏనాడు రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు రెండో రాజధాని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement