సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై తాను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ ఆరోపించారు. తాను ప్రభుత్వ విధానాలను విమర్శించానని గన్‌మెన్‌లను తీసేశారని, ఏడాది కాలంగా తనకు రావాల్సిన మాజీ ఎమ్మెల్యే పింఛన్ ఇవ్వడం లేదని మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తన సోదరుడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా తొలగించారని, తన మరో సోదరుడు న్యాయపరంగా దక్కించుకున్న కాంట్రాక్టులను కూడా తొలగించారని ఆరోపించారు. ఐకియాకు ఇచ్చిన అనుమతుల్లో క్విడ్‌ప్రోకో జరిగిందని, హెరిటేజ్ భవనాన్ని తొలగించి కేటీఆర్ వందల కోట్లు సంపాదించడాన్ని తాను పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఏడుసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment