సాక్షి, న్యూఢిల్లీ: తమ శాసనసభ సభ్యత్వాలను అప్రజాస్వామిక రీతిలో రద్దు చేశారని, రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో తాము ఓటు వేసేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్‌ను కలసి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో రాజ్య సభ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహ రిస్తున్న అసెంబ్లీ సెక్రెటరీ రాష్ట్ర ప్రభుత్వ తొత్తులా వ్యవహరిస్తున్నారని.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకో కుండానే రాజ్యసభ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారన్నారు. అంతేగాకుం డా తమ అసెంబ్లీ సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ఆరు వారాల వరకు ఎలాం టి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.
రాజ్యసభ ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోమటిరెడ్డి, సంపత్‌ల వెంట కాంగ్రెస్ సీని యర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఉన్నారు. అనం తరం వారు మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తిపై ఓపీ రావత్ సానుకూలంగా స్పందిం చారని.. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుం టామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే..
రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిని కోమటిరెడ్డి, సంపత్‌లు ప్రతిపాదించారని, కాబట్టి వారు ఓటు వేసేందుకు అర్హులని మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల కారణం గా.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోమటిరెడ్డి, సంపత్‌ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారన్నారు.
ప్రజాప్రతి నిధుల చట్టంలోని సెక్షన్ 152 కింద ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని.. ఓటర్ల జాబితా నుంచి సభ్యులను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. కానీ ఇక్కడ ఆ నిబంధనను పాటించలేదన్నారు. అందువల్ల రిటర్నింగ్ అధికారిని మార్చాలని, కోమటిరెడ్డి, సంపత్‌లకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశమివ్వాలని ఎన్ని కల ప్రధానాధికారిని కోరామన్నారు.
నా హత్యకు ప్రభుత్వం కుట్ర
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే తన గన్‌మన్లను ఉప సంహరించుకుందని, పాత కేసులన్నింటినీ తిరగదోడుతోందని పేర్కొన్నారు. ఒక్క కోమటిరెడ్డి పోతే వందల కోమటిరెడ్డిలు నల్లగొండ జిల్లాలో పుట్టుకొస్తారని.. వారందరినీ చంపుతారా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment