బేస్తవారిపేట మండలకేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
బేస్తవారిపేట మండలకేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ప్రమాదవశాత్తూ సిమెంటు లారీ వెనక టైరు కిందపడ్డారు. ఈ ఘటనలో మోక్షగుండం గ్రామానికి చెందిన సంపత్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.