ఖైదీల హక్కుల కోసం పోరాడాలి
ఇన్ బాక్స్
రాజకీయ ఖైదీలను, ఏడేళ్ల శిక్షాకాలం పూర్తయిన జీవి త ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్‌తోను; 1994-95 జైలు పోరాటంలో సాధించుకున్న డిమాం డ్ల పునరుద్ధరణ ధ్యేయంగా కమిటీ ఫర్ ది రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సీఆర్‌పీపీ) హక్కుల వారోత్స వాన్ని నిర్వహిస్తున్నది. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ దేవ్‌ల 84వ వర్ధంతి సందర్భంగా మార్చి 23 నుంచి 30 వరకు ఈ వారోత్సవాన్ని నిర్వహిస్తున్నది. భగత్ సింగ్ కాలం నుంచి ఖైదీల హక్కుల కోసం పోరాటం సాగుతూనే ఉంది. విప్లవకారులు, ప్రజాస్వామ్యవా దులు రాజకీయ హక్కుల కోసం దేశంలోను, ఇప్పు డు రెండు రాష్ట్రాలుగా ఉన్న తెలుగు ప్రాంతంలోను అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలోను, నక్సల్బరీ, శ్రీకాకుళం రైతాంగ పోరాట కాలంలోను మలి తెలంగాణ పోరాటకాలం లోను జైల్లో ఉద్యమకారులు ఎన్నో పోరాటాలు చేశా రు. వాటిలో చరిత్రాత్మకమైనది 1994-95 నాటి పోరాటం. దీనితో ఏడేళ్లు పూర్తి చేసిన జీవిత ఖైదీల విషయం సహా అన్ని న్యాయమైన డిమాండ్లు ఆమో దం పొందాయి. దానితో నాలుగు వందల మంది జీవిత ఖైదీలు విడుదలయ్యారు. గతంలో ఎన్టీఆర్, అప్పుడూ ఇప్పుడూ చంద్రబాబు, ఇప్పుడు చంద్రశే ఖరరావు హయాంలోను అణచివేత కొనసాగుతూనే ఉంది. ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న మేధా వులపైన, అమాయక గిరిజనుల పైన, విప్లవకారుల పైన ఈ నిర్బంధం ఆగడంలేదు.
దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఆదివాసీల భూములు బహు ళ జాతి సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. నిజానికి ఇది ఆదివాసేతర ప్రజల ప్రయోజనాల కోసమనే కాదు, ఇప్పుడు బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం నాయకులు శక్తి వంచన లేకుండా పాటు పడుతున్నారు. ఆదివాసేత రుల నుంచి భూమిని కాపాడుకోవడానికి గిరిజనులు ప్రయత్నించినపుడు ఎన్టీఆర్ చింతపల్లి అడవులలోకి రిజర్వు దళాలను పంపారు. నక్సలైట్ల సానుభూతిప రులనే నెపంతో ఇప్పుడు చంద్రశేఖరరావు తెలంగా ణలో గుత్తికోయలను తరిమివేయాలని చూస్తున్నారు. చింతపల్లిలో వేల ఎకరాలను బాక్సైట్ కోసం పెద్ద కంపెనీకి ఇవ్వాలని చూస్తున్నారు. అక్కడి కాఫీ తోట లు ఇప్పటికే కాంట్రాక్టర్ల పరం చేశారు. వీటిని ప్రతి ఘటించిన గిరిజనులను అరెస్టు చేయిస్తున్నారు. పోరాడి బయటపడుతున్నా, మళ్లీ అరెస్టు చేయిస్తూ వేధిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే సెషన్స్ కోర్టులో యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలు హైకోర్టులో అప్పీలు చేసుకుంటే ఐదా రేళ్లు గడిచినా విచారణ చేపట్టడంలేదు. దీనితో ఇలాం టి విచారణలు త్వరగా చేపట్టాలని లేదా బెయిల్ ఇవ్వాలని ప్రొ. హరగోపాల్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించలేదు. ఇలాంటి ధోరణి వ్యాజ్యా నికే విరుద్ధమని వాదనలు వచ్చాయి. ఇక సుప్రీం కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది. అంటే 1994-95 ప్రాంతంలో సాధించుకున్న హక్కులన్నీ హరించుకుపోతున్నాయి. మళ్లీ పాత అణచివేతే తలె త్తుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారోత్సవాన్ని జరుపు కుంటూ, ఇందులో భాగంగా మార్చి 28న హైదరా బాద్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమాన్ని అందరూ సమర్ధించవలసిన అవస రం ఉంది.
- ఎ. నరసింహారెడ్డి, ఎ. దశరథ్
సీఆర్‌పీపీ. హైదరాబాద్