
గీత కార్మికులకు సర్కారు వాత
కల్లుగీత అనేది అతి పురాతన వృత్తి. కానీ ప్రభుత్వ విధానాల వల్ల, ప్రపంచీకరణ వల్ల కల్లుగీత వృత్తి నిరాదరణకు గురైంది. ఈ వృత్తినే నమ్ముకుని దీనిపైనే ఆధారపడి బతికే పరిస్థితీ లేకుండా పోయింది. ప్రకృతి సిద్ధంగా పెరిగిన తాటి, ఈత చెట్లపై ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోంది. కానీ గీత కార్మికుల గురించి అబ్కారీశాఖ, ప్రభుత్వం, ఈ సామాజిక వర్గం నుండి గెలుపొంది పదవులు అనుభవిస్తున్న వారు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కల్లు అమ్మ కాలు లేకుండా చేసి మద్యం అమ్మకాలు వేల కోట్లకు పెంచుకోవా లనే దుర్బుద్ధితో ప్రభుత్వం బహుళ జాతి మద్యం కంపెనీలతో, స్వదేశీ, విదేశీ లిక్కర్ సంస్థలతో మద్యం సిండికేట్లతో కుమ్మక్క యింది. వృత్తికి రక్షణలేకుండాపోయింది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అయినా గీత కార్మికుల బతుకులు బాగుపడతాయని, ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత కల్పిస్తుందని ఆశిం చారు. చంద్రబాబు ఆర్నెల్ల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ, మాకు మద్యం ప్రధానం కాదు. రాష్ట్రంలో అనధికారికంగా ఉన్న బెల్టు షాపులు తొలగిస్తున్నామని ప్రకటించి జీవో కూడా ఇవ్వ డంతో గీత కార్మికులు సంబరపడ్డారు.
కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలువలేదు. 5 నెలలకే మా ప్రభుత్వానికి మద్యం ఆదాయం చాలా అవసరం. కొత్తగా ఊరూరా 10 వేల మద్యం షాపులు అధి కారికంగానే తెరుస్తున్నాం అని ఆదేశాలు ఇవ్వడంతో గీత కార్మి కుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ఏపీలో కేరళ, తమిళనాడు మద్య విధానం అమలు జరుపుతామని పైకి చెబుతూ ఆదాయం కోసం మద్యాన్ని వరదలా పారించే ఎత్తుగడలో చంద్రబాబు ఉన్నా రు. వాస్తవానికి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గీత వృత్తిని ఉపాధి కలిగించేదిగా, ఒక ఆర్థిక విధా నంగా గుర్తించారు. ఏపీ ప్రభుత్వం మాటల్లో ఒకరకంగా, చేతల్లో మరో రకంగా వ్యవహరిస్తూ గీత కార్మికులపై కక్షకట్టి కల్లు అమ్మ కాలు దెబ్బతీయడానికి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. పూనేలో వలే మన రాష్ట్రంలో ఆరు నెలలపాటు కల్లును నిల్వ ఉంచే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయాలి. నీరా, కల్లును నేచురల్ డ్రింక్‌గా ప్రచారం కల్పించాలి. గీత వృత్తిని ఆధునీకరించి, తగిన గౌరవం, రాబడి కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఉపా ధి కాపాడాలి. ప్రతి గీత కార్మిక కుటుంబానికి మూడెకరాల భూమి ఇచ్చి సమాజంలో హోదా కల్పించాలి.
జుత్తిగ నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కల్లుగీత కార్మిక సంఘం