గుట్కా మాఫియా | Inbox - 05.05.2015 | Sakshi
Sakshi News home page

గుట్కా మాఫియా

Published Tue, May 5 2015 2:54 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

గుట్కా మాఫియా - Sakshi

గుట్కా మాఫియా

 ఇన్ బాక్స్

 అన్ని మాఫియాల్లాగే గుట్కా మాఫియా కూడా రెండు రాష్ట్రాలలోనూ విస్తరించి ప్రజల ప్రాణాల మీదికి తెస్తూ కేన్సర్ వంటి రోగాలు విస్తరిం పజేస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం చూసీచూడనట్టు వ్యవహ రించడం శోచనీయం. గుట్కా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. కానీ పట్టుకోవడానికి మాత్రం ఏ అధికారికీ సాహసం లేదు. వాళ్లిచ్చే కాసుల కోసం కక్కుర్తి పడి ఈ వ్యాపారాన్ని పరోక్షంగా అధికారులే నడిపిస్తున్నారంటే ఇంతకం టే ఘోరం ఇంకొకటి ఉంటుందా? గుట్కా వ్యాపారం ఏడాదికి 2,000  కోట్లు ఉందంటే ఇంక ఏమి చెప్పాలి? మొక్కుబడికి ఏవో రెండు కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా మాత్రం కృషి చేయడం లేదు. జంటనగరాలలో ఏ పాన్‌షాప్‌లో చూసి నా గుట్కా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు.. కాలేజీలు, స్కూళ్లు ఇంకా అక్కడా ఇక్కడా అని లేకుండా ఎక్కడైనా విచ్చలవిడిగా వ్యాపా రం జరుగుతోందంటే ఇంక నిషేధం మాటెక్కడ? పైగా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా తరలించడం. ఎన్ని చట్టాలు చేస్తే మాత్రం ఏమి లాభం? ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న గుట్కా కేంద్రాలు మూయించడమే కాదు అమ్ముతున్న వాళ్లకు కూడా కఠినంగా శిక్షలు వేయాలి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరిచి వెంటనే ఈ గుట్కా మహమ్మారిని అంతం చేయాలి.
 పద్మావతి  హైదరాబాద్
 
 ఒంటినిండా విషపదార్థాలే!
 సహజ సిద్ధంగా పండించిన ఆహార పదార్థాలకు మనం ఎప్పుడో దూరమయ్యాము. అధిక దిగుబడుల కోసం సేంద్రియ ఎరువులను వదిలి, రసాయన ఎరువుల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ రసాయన ఎరువుల వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర వుతున్న విషయం తెలిసిందే. వరి, గోధుమ, మక్క, జొన్న లాంటి ఆహార పంటలను చూస్తే.. మనం సహజ పంటలకు ఎప్పుడో దూరమయ్యాం. మన ఆరోగ్యానికి అవసర మైన ఏ పదార్థమూ ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. ఇక ఫలాల విషయానికి వస్తే, మామిడి, సపోట, అరటి లాంటి పండ్లయితే అచ్చం విష పదార్థాలు కలిపి మగ్గిస్తున్నారు. ముఖ్యంగా రానున్న మధుర ఫలం మామిడి విషయా నికి వస్తే కాల్షియం కార్బైడ్ అనే రసాయనం వేసి మగ్గించి అమ్మడం సర్వసాధారణమైపోయింది. ఈ విష పదార్థం వాడి పండించిన పండ్లు చూడ్డానికి తేడా కనిపించకపోయినా రుచి, వాసన సహజంగా పండిన పండుకు ఎంతమాత్రం సాటిరాకపోగా అనేకమైన ఉదరకోశ వ్యాధులు సంభవిస్తాయని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే రసాయనాలను తక్షణం అరికట్టే విధంగా ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నాం.
 తవుటు రాంచంద్రం  జగిత్యాల, కరీంనగర్ జిల్లా

 పాల(కు)ల పునరావాసం
 సిఫార్సులు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లకే టీటీడీ పాలక మండలిలో స్థానం. కానీ ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికి చోటులేదు.  ఇంతవరకూ పాలక మండలి నియామకం ఇలాగే జరగడంపై ఎన్ని విమర్శలు వచ్చినా వీసమంత మార్పు మాత్రం శూన్యం. సారా కాంట్రాక్టర్లు, వ్యాపారం చేసుకునే వాళ్లు, సినిమాలో స్త్రీల అందాలను చూపించే వాళ్లు ఇలా చెప్పుకుంటూపోతే కొండవీటి చేంతాడు. అక్కడ వీఐపీలకు సేవలు చేస్తూ తెరవెనుక వాళ్ల వ్యాపారాలు, పైరవీలు చేసు కునేందుకు అదొక రాజకీయ పునరావాసం. తిరుపతి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయినందుకు గాను మన బాబుగారు, కృష్ణమూర్తికి చైర్మన్ పోస్టు ఇచ్చారు. ఇంతవరకూ ఏ పాలక మండలి కూడా భక్తుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు, సరికదా ఆర్జిత సేవాటికెట్ల కుంభ కోణం దగ్గర నుంచి ఫినాయిల్ కాంట్రాక్ట్ కుంభకోణం వరకూ ఏ ఒక్క దానికీ అతీగతీలేదు సరికదా బుట్టదాఖలు కావడం శోచనీయం. అసలు పాలక మండలి ఉన్నా లేకపోయినా ఒకటే. ఇది వీఐపీలకు సేవా మం డలి కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించే  దిశగా మాత్రం ఏనాడూ ఏమీ చేసిన పాపాన పోలేదు సరికదా భక్తులను లాఠీలతో కొట్టించి తప్పుడు కేసులు పెట్టిన ఘనత మాత్రం మన పాలక మండలి ఘనతే అని చెప్ప వచ్చు. కాబట్టి ఇప్పటికైనా పాలక మండలి తీరు మార్చుకుని భక్తులకు సేవ చేయాలి.
 ఎస్ విశ్వనాథం  చిక్కడపల్లి, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement