(ఇన్ బాక్స్)
తెలంగాణ రాష్ట్రం నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యుత్ కొరత. నేటి విద్యుత్ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన డానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ, దీర్ఘకాలిక చర్యలను చేపట్టింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రజలు కలసికట్టుగా విద్యుత్ ఆదా కోసం ప్రయత్నించాలి. దుర్వినియోగాన్ని అరికట్టాలి. ప్రజోపయోగాన్ని ఆశించి ప్రభుత్వం ఏటా కోట్ల కొలదీ నిధులను విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చి స్తోంది. ఏటా ప్రభుత్వం విద్యుత్‌పై చేసే ఖర్చు లో 40 శాతం కూడా తిరిగి చేతికి రావడం లేదు.
సరఫరాలో జరిగే విద్యుత్ నష్టానికి తోడు విని యోగమయ్యే ప్రతి యూనిట్ నమోదు కాకపో వడం వల్ల భారీగా నష్టాలు తప్పడం లేదు. పేద, అల్పా దాయ వర్గాల లబ్ధి కోసం ఉద్దేశించిన స్లాబ్ విధానం దుర్విని యోగమవుతోంది. ఒకే కుటుంబం ఉంటున్న ఇంటికి సైతం రెండు, మూడు అదనపు కనెక్షన్లను తీసుకొని కొందరు స్లాబ్ విధానంలో సామాన్యుల్లా లబ్ధిని పొందుతుండటం తరచుగా జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం విద్యుత్ చౌర్యం, అదనపు మీటర్లు, ఉద్యోగుల అవినీతి, అక్రమాలను అరికట్టడంపై దృష్టిని కేంద్రీకరించాలి.
(కంది కృష్ణారెడ్డి, కరీంనగర్)