
కాకా కలల సాకారం
ఇన్ బాక్స్
నిరుపేదలు, ఆశ్రీతుల హృదయాల్లో కాకాగా నిలిచిపోయిన అరు దైన నేత జి.వెంకటస్వామి కన్నుమూశారు. ఆయన మృతితో ఒక శకం ముగిసింది. నెహ్రూ హయాం నుంచి రాజీవ్ గాంధీ వరకు ఆయన కాంగ్రెస్‌కే అంకితమయ్యారు. అట్టడుగు జీవితం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ రాజకీయాల దాకా పయనించిన కాకా నిమ్న వర్గాలకు ఎన్నటికీ చెరగని స్పూర్తి ప్రదాత. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో పోలీసు కాల్పుల బారిన పడిన కాకా తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమయ్యే దాకా బతికే ఉంటానని ప్రకటించి మృత్యువు సమీపానికి వెళ్లి కూడా నవతెలంగాణ కోసం ఊపిరి నిలుపుకున్నారు.
తెలంగాణ అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్న ప్రాణహి త- చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డితో పలుసార్లు చర్చించి ఆమోద ముద్రవేయించుకున్నారు. నిజాం వ్యతిరేక పోరాటం, సాయుధ పోరాటం, ఆర్యసమాజ్, రామానంద తీర్థ శిష్యరికం, జైలు జీవితం, అనంతరం కూలీ వృత్తి, ఆపై కార్మికనాయకత్వం.. ప్రాంతీయ, జాతీయ రాజకీయాల దాకా ప్రస్థానం. దళిత నేతకు దక్కిన అరుదైన గౌరవమిది. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వంతో మెలిగిన కాకాకు అశ్రు నివాళి.
రామచంద్ర, పెద్దపల్లి, కరీంనగర్