G.Venkataswamy
-
ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహావిష్కరణ
-
ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహావిష్కరణ
హైదరాబాద్ : దివంగత కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరించారు. ట్యాంక్ బండ్ ఆరంభంలో ఉన్న అంబేద్కర్ పార్క్‌లో కాకా విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం కాకా చివరిదాకా పరితపించారన్నారు. కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు కాకా విగ్రాహావిష్కరణను నిరసిస్తూ తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాకా కలల సాకారం
ఇన్ బాక్స్ నిరుపేదలు, ఆశ్రీతుల హృదయాల్లో కాకాగా నిలిచిపోయిన అరు దైన నేత జి.వెంకటస్వామి కన్నుమూశారు. ఆయన మృతితో ఒక శకం ముగిసింది. నెహ్రూ హయాం నుంచి రాజీవ్ గాంధీ వరకు ఆయన కాంగ్రెస్‌కే అంకితమయ్యారు. అట్టడుగు జీవితం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ రాజకీయాల దాకా పయనించిన కాకా నిమ్న వర్గాలకు ఎన్నటికీ చెరగని స్పూర్తి ప్రదాత. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో పోలీసు కాల్పుల బారిన పడిన కాకా తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమయ్యే దాకా బతికే ఉంటానని ప్రకటించి మృత్యువు సమీపానికి వెళ్లి కూడా నవతెలంగాణ కోసం ఊపిరి నిలుపుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్న ప్రాణహి త- చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డితో పలుసార్లు చర్చించి ఆమోద ముద్రవేయించుకున్నారు. నిజాం వ్యతిరేక పోరాటం, సాయుధ పోరాటం, ఆర్యసమాజ్, రామానంద తీర్థ శిష్యరికం, జైలు జీవితం, అనంతరం కూలీ వృత్తి, ఆపై కార్మికనాయకత్వం.. ప్రాంతీయ, జాతీయ రాజకీయాల దాకా ప్రస్థానం. దళిత నేతకు దక్కిన అరుదైన గౌరవమిది. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వంతో మెలిగిన కాకాకు అశ్రు నివాళి. రామచంద్ర, పెద్దపల్లి, కరీంనగర్ -
వెంకటస్వామి మృతికి పలువురి సంతాపం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఏపీ, తెలంగాణ నేతలతోపాటు జాతీయ నేతలు కూడా పలువురు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపినవారిలో వైఎస్ఆర్ సీపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, ఏపీసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నా లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, ఎం.సత్యనారాయణ, పెదపల్లి ఎంపి బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి(85) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 8.40 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 1929 అక్టోబరు 5న ఆయన సికింద్రాబాద్‌లో జన్మించారు. 1957, 1978లలో ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో తొలిసారిగా పెద్దపల్లి నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 7 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పలుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో ఆయన పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కొడుకులూ రాజకీయాలలోనే ఉన్నారు. మాజీ మంత్రి శంకర రావు ఆయన పెద్ద అల్లుడు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ముషీరాబాద్ జైలు వద్ద జరిగిన కాల్పుల్లో వెంకటస్వామి గాయపడ్డారు. నేషనల్ హట్స్ సొసైటీ కింద వేల మంది పేదలకు ఆయన గుడిసెలు నిర్మించారు. అప్పటి నుంచి ఆయనను గుడిసెల వెంకటస్వామిగా పిలుస్తారు. కాకా స్థాపించిన విద్యాసంస్థను ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోకుండా నిర్వహిస్తున్నారు. వెంకటస్వామి ఎన్నికైన, చేపట్టిన పదవులు: 1957- 62, 1978-84 శాసనసభ సభ్యుడు 1967 లో 4వ లోకసభకు పెద్దపల్లి నుంచి ఎన్నికయ్యారు. 1969 - 71 పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు 1971 లో 5వ లోకసభకు ఎన్నికయ్యారు. 1973 - 1977 - కేంద్ర మంత్రి 1977 లో 6వ లోకసభకు ఎన్నికయ్యారు. 1978 - 1982 రాష్ట్ర మంత్రి 1982 - 1984 పిసిసి అధ్యక్షుడు 1989 లో 9వ లోకసభకు ఎన్నికయ్యారు. 1991 లో 10వ లోకసభకు ఎన్నికయ్యారు. 1991-1996 కేంద్ర మంత్రి 1996 లో 11వ లోకసభకు ఎన్నికయ్యారు. 2002-2004 ఏఐసీసీ ఎస్సీ అండ్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు. 2004 లో 14వ లోకసభకు ఎన్నికయ్యారు. ఇంకా కేంద్రంలో అనేక కమిటీలలో సభ్యుడుగా ఉన్నారు.