దళితులెప్పుడూ రాజకీయ యాచకులేనా?
సుమారు 65 ఏళ్ల క్రితం డా. బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ దళి తులకు అన్నిరంగాలలో 15 శాతం రిజర్వేషన్ కలిపించమని రాజ్యాం గంలో ప్రతిపాదించారు. అయితే 15 శాతం రిజర్వేషన్ అన్నది శాశ్వతం కాదు. ఈ 65 ఏళ్ల కాలంలో దళిత జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సి ఉంది. కానీ పాలక పార్టీలు దళితులలో, వారి ఉప కులాల్లో చిచ్చు పెట్టి మీరు, మీరు కొట్టుకొని చావండి అనే చందంగా తమాషా చూస్తున్నారు. భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్ విధా నాన్ని పునరాలోచించాలి. మొత్తం జనాభాలో ఎస్సీలు, ఎస్టీల సంఖ్య ప్రస్తుతం 35-40 శాతం పైచిలుకే ఉంటుంది అని అంచనా. పైగా జనా భా పెరుగుతున్నప్పటికీ, వారి ఆర్థిక స్థితిగతులలో ఏ మాత్రం మార్పు రాలేదు. దళితులు ఎంతసేపటికీ రాజకీయ పదవులు అడుక్కునే విధం గా వ్యవహరించడం, మరిన్ని రాయితీల కోసం ప్రాధేయపడటం అంత మంచిది కాదు. రాజ్యాధికారం వారి లక్ష్యం కావాలి. అంతే కాని దళితు లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, మంత్రి పదవులు ఇవ్వాలని యాచకుల లాగ అడుక్కోవడం భావ్యం కాదు. దళితుల ఓట్లు దళితులకే దక్కేవిధంగా రాజ్యాంగంలో మార్పు చేయవలసినది పోయి ఒకరి మోచేతి గంజి తాగే లాగ వ్యవహరించవద్దు. ప్రతి దళితుడు ఆర్థికంగా సామాజికంగా బలపడినప్పుడే దళిత వర్గాలకు దళిత కులాలకు సమా నత్వం వస్తుంది. ఆనాడు అంబేద్కర్.. దళిత ప్రజలు పాలితులుగా కాకుండా పాలకులుగా ఎదగాలని బోధించారు. కానీ నేడు ఎస్సీలను ఎ,బి,సి,డి,లుగా చెయ్యాలని వీరు, చెయ్యొద్దని వారు తమలో తాము వైషమ్యాలు పెంచుకొని అన్ని విషయాలలో దళితులు నష్టపోతున్నారు.
రిజర్వేషన్‌ను వేరే వారికిచ్చే దిశగా దళితులు ఎదగాలి కానీ దళితులను ఎ,బి,సి,డి,లుగా గుర్తించమని ఒకరి దగ్గరకువెళ్లి అడుక్కునే పద్ధతిని విడ నాడాలి. గతంలో యూపీయే ప్రభుత్వం 9 రాష్ట్రాలలో జాట్ కులస్తులను ఓబీసీ. జాబితాలో చేర్చి వారికి రిజర్వేషన్లు కలిపించడంపై సుప్రీంకోర్టు కొట్టివేసింది. కుల ప్రాతిపదికన కాకుండా సామాజిక, ఆర్థికస్థితిగతు లను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లను కలిపించాలని సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. రిజర్వేషన్ కోటా అనేది ఎప్పుడూ ఉండేది కాదు. దళితులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నంతవరకే రిజర్వేషన్లు అమలులో ఉంటాయి. రిజర్వేషన్లను శాశ్వతంగా పొందుతుండటం అంటే ఆ మేరకు వారిలో వెనుకబాటుతనం కొనసాగుతున్నట్లే అని అర్థం. ప్రభుత్వం వెనుకబడిన వర్గాల ప్రజల అవకాశాలను మెరుగుపర్చి వారు అందరితో పోటీ పడి బతుకగలిగే పరిస్థితులను కల్పించాలే తప్ప దళిత కులాలకు వాటి ఉప కులాలకు మధ్య చిచ్చు పెట్టి కొట్టుకొని చావండి అనే చందంగా ఉండకూడదు.
కోదాటి శ్యాంసుందర్, కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,
ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం, హైదరాబాద్
వయోపరిమితి పెంచాలి
తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఇక్కడి నిరుద్యోగులకు అన్యా యం జరిగే అవకాశాలు ఉన్నట్టు చాలామంది భావిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి తమను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని కూడా లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టి అమ లుచేస్తోంది. దీనితో అన్ని వైపుల నుంచి కేసీఆర్ సర్కార్ పట్ల, నిర్ణ యాల పట్ల హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పుడు నిరుద్యోగ యువత పట్ల కూడా కేసీఆర్ దృష్టి పెట్టవలసి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవలసిన సమయం ఆసన్నమైంది. అందుకే అన్ని ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచడం గురించి యోచించాలి. ప్రభుత్వ శాఖలలోనే కాకుండా, సింగరేణి, ట్రాన్స్‌కో వంటి సంస్థలలో నియామకాలను కూడా టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే చేట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అప్పుడే నియామకాలు పార దర్శకంగా, అవినీతికి తావు లేని విధంగా జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో సకాలంలో ఉద్యోగాలను భర్తీ చేయనందువల్ల, అవినీతి వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. దీనితో వారి వయోపరి మితి దాటిపోయింది. నిరుద్యోగులు బాధలను గమనించిన కేసీఆర్ ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని వయోపరిమితిని పెంచాలి. తెలంగాణ నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలి.
కంది కృష్ణారెడ్డి , కరీంనగర్