ప్రాథమిక విద్యే కీలకం | Primary education is crucial | Sakshi
Sakshi News home page

ప్రాథమిక విద్యే కీలకం

Published Tue, Mar 27 2018 12:48 PM | Last Updated on Tue, Jun 4 2019 6:39 PM

Primary education is crucial - Sakshi

కామెడీ చేస్తున్న జబర్దస్త్‌ టీం సభ్యులు  

కొండపాక(గజ్వేల్‌): చదువులో ఉన్నత స్థాయికి చేరాలంటే ప్రాథమిక విద్యే కీలకమని సిద్దిపేట జిల్లా డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ బాబూరావు పేర్కొన్నారు. మండల పరిధిలోని కుకునూరుపల్లిలోని సెంట్‌ఆన్స్‌ స్కూల్‌ 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలపై అవగాహన ఎంతో అవసరమన్నారు.

పిల్లలను హాస్టల్స్‌లో వేయడం వల్ల ప్రేమాభిమానాలను దూరం చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన నాటికలతో పాటు జబర్దస్త్‌ టీం నిర్వహించిన కామెడీ సబికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, కోల సద్గుణ, పొల్కంపల్లి లక్ష్మి, జబర్దస్తు టీం స భ్యులు వినోధిని, బుల్లెట్‌ భాస్కర్, సునామి సుధాకర్, ఉదయ్, పాఠశాల కరస్పాండెంట్‌ చంటి, ప్రిన్సిపల్‌ సరోజిని దేవి, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement