saint anns
-
ప్రాథమిక విద్యే కీలకం
కొండపాక(గజ్వేల్): చదువులో ఉన్నత స్థాయికి చేరాలంటే ప్రాథమిక విద్యే కీలకమని సిద్దిపేట జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ బాబూరావు పేర్కొన్నారు. మండల పరిధిలోని కుకునూరుపల్లిలోని సెంట్ఆన్స్ స్కూల్ 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. పిల్లలను హాస్టల్స్‌లో వేయడం వల్ల ప్రేమాభిమానాలను దూరం చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన నాటికలతో పాటు జబర్దస్త్ టీం నిర్వహించిన కామెడీ సబికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, కోల సద్గుణ, పొల్కంపల్లి లక్ష్మి, జబర్దస్తు టీం స భ్యులు వినోధిని, బుల్లెట్ భాస్కర్, సునామి సుధాకర్, ఉదయ్, పాఠశాల కరస్పాండెంట్ చంటి, ప్రిన్సిపల్ సరోజిని దేవి, ఉపాద్యాయులు పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంప్ సెయింట్‌ఆన్స్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ మహిళా జూడో చాంపియన్‌షిప్‌లో సెయింట్ ట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. వెస్ట్ మారేడ్‌పల్లిలోని కస్తూర్భా గాంధీ డిగ్రీ కళాశాలలో జరిగిన పోటీల్లో మొత్తం 28 పాయింట్లు సాధించి సెయింట్ ఆన్స్ కాలేజ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 26 పాయింట్లతో కస్తూర్బా గాంధీ కాలేజ్ రెండో స్థానాన్ని, 11 పాయింట్లతో ఎస్.ఎన్. వనితా మహావిద్యాలయ కాలేజ్ మూడో స్థానాన్ని సంపాదించుకున్నాయి. అనంతరం జీహెచ్ఎంసీ జాయింట్ డెరైక్టర్ పి. వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వివిధ వెయిట్ విభాగాల విజేతల వివరాలు 44 కేజీ: 1. కె. మహేశ్వరి (సెయింట్ ఆన్స్), 2. మరియా అనూష (కస్తూర్బా గాంధీ), 3. రజినీ (సెయింట్ ఫ్రాన్సిస్), బి. లక్ష్మి (ఎస్.ఎన్ వనితా మహావిద్యాలయ). 48 కేజీ: 1.శ్రావ్య వర్మ (సెయింట్ ఆన్స్), 2. సుష్మా (కస్తూర్బా గాంధీ), 3. వైష్ణవి (వనితా మహావిద్యాలయ), గాయత్రి (సెయింట్ ట్ ఫ్రాన్సిస్). 52 కేజీ: 1. శ్రావ్య (కస్తూర్బా గాంధీ), 2. మౌనిక (సెయింట్ ట్ ఆన్స్), 3. డి. నిఖిత (వనితా మహావిద్యాలయ), ఎం. సౌమ్య (సెయింట్ ట్ ఫ్రాన్సిస్). 57 కేజీ: 1. అంకితా సింగ్ (కస్తూర్బా గాంధీ), 2. కె. శ్రావణి (వనితా మహావిద్యాలయ), 3. హాసిత (సెయింట్ ట్ ఫ్రాన్సిస్), బి.మనీష (సెయింట్ ఆన్స్ ). 63 కేజీ: 1. శ్రావణి సింగ్ (కస్తూర్బా గాంధీ), 2. ఇషత్ర్ అజీజ్ (సెయింట్ ఆన్స్), 3. జి. మమత (వనితా మహావిద్యాలయ). 70 కేజీ: 1. విన్నీ షరాన్ (ఓయూ మహిళా కాలేజ్), 2. నిఖిత (సెయింట్ ఫ్రాన్సిస్), 3. శివాని (కస్తూర్బా గాంధీ), శ్వేతా సింగ్ (సెయింట్ ఆన్స్). 78 కేజీ: 1. ఆయేషా రజియా (సెయింట్ ఆన్స్), 2. అశ్విని (వనితా మహావిద్యాలయ), 3. శ్రావ్య (సెయింట్ ఫ్రాన్సిస్), ఎం. జ్యోష్న (ఓయూ మహిళా కాలేజ్). + 78 కేజీ: 1. సారా నౌషీన్ (సెయింట్ ఆన్స్), 2. హీనా బేగం (కస్తూర్బా గాంధీ), 3. అశ్విని (వనితా మహావిద్యాలయ), ఎల్. శ్రావ్య (ఓయూ మహిళా కాలేజ్). -
స్కూల్ బస్సు బోల్తా...28 మందికి గాయాలు
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామ సమీపంలో గురువారం ఉదయం సెయింట్ ఆన్స్‌కు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. మండలంలోని మూలసాల, కొత్తపల్లి గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకొని బోజన్నపేట చేరుకునే సమయంలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవార్త తెలుసుకున్న వెంటనే పెద్దపల్లి సీఐ ప్రశాంత్‌రెడ్డి, ఎస్సైలు జగన్మోహన్, రవికుమార్ బోజన్నపేటకు చేరుకొని విద్యార్థులను స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయూలైన 5 గురు విద్యార్థులను కరీంనగర్‌కు తరలించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకొని విద్యార్థుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి కేవలం 10 అడుగుల దూరంలోనే 11 కేవీ కరెంటు స్తంభం ఉండటంతో ఒకవేళ బస్సు స్తంభానికి ఢీకొని ఉండుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని తల్లిదండ్రులు ఆందోళన చెందారు -
సింధూపై ప్రశంసల జల్లు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం పీవీ సింధూ కాంస్య పతకం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చదువుతున్న మెహిదీపట్నంలో సెయింట్‌ఆన్స్ మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థి భారత బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న సింధూ చదువు, ఆట పట్ల ఎంతో సిన్సియర్‌గా ఉంటుందని తెలిపారు. చదువును నిర్లక్ష్యం చేసేది కాదు ఎన్ని టోర్నీలకు హాజరైనా సిం ధూ చదువును మాత్రం నిర్లక్ష్యం చేసేది కాదు. తీరిక సమయంలో ప్రత్యేక తరగతులను కూడా తీసుకొనే వాళ్లం. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సంచలనం సృష్టించడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. - విమలారెడ్డి, ఫిజికల్ డెరైక్టర్ గర్వంగా ఉంది.. దేశానికి బ్యాడ్మింటన్‌లో పేరు తెచ్చిన సింధూ మా కాలేజీ విద్యార్థిని కావడం గర్వంగా ఉంది. దేశ కీర్తిని ప్రపంచానికి చాటేలా సింధూ విజేతగా నిలవడం ఆనందంగా ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలి. - ఆంథోనమ్మ, ప్రిన్సిపల్ మరిన్ని విజయాలు సాధించాలి విద్యార్థి దశలోనే బ్యాడ్మిం టన్లో సంచలనం సృష్టిం చిన సింధూ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తుందన్న నమ్మకం ఉంది. భారత బ్యాడ్మింటన్‌కు ఆదర్శంగా నిలిచేలా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆట తీరు ప్రదర్శించింది. - బాలమరిరెడ్డి, లైబ్రేరియన్ హెడ్