సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ మహిళా జూడో చాంపియన్‌షిప్‌లో సెయింట్ ట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. వెస్ట్ మారేడ్‌పల్లిలోని కస్తూర్భా గాంధీ డిగ్రీ కళాశాలలో జరిగిన పోటీల్లో మొత్తం 28 పాయింట్లు సాధించి సెయింట్ ఆన్స్ కాలేజ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 26 పాయింట్లతో కస్తూర్బా గాంధీ కాలేజ్ రెండో స్థానాన్ని, 11 పాయింట్లతో ఎస్.ఎన్. వనితా మహావిద్యాలయ కాలేజ్ మూడో స్థానాన్ని సంపాదించుకున్నాయి. అనంతరం జీహెచ్‌ఎంసీ జాయింట్ డెరైక్టర్ పి. వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
వివిధ వెయిట్ విభాగాల విజేతల వివరాలు
44 కేజీ: 1. కె. మహేశ్వరి (సెయింట్ ఆన్స్), 2. మరియా అనూష (కస్తూర్బా గాంధీ), 3. రజినీ (సెయింట్ ఫ్రాన్సిస్), బి. లక్ష్మి (ఎస్.ఎన్ వనితా మహావిద్యాలయ). 48 కేజీ: 1.శ్రావ్య వర్మ (సెయింట్ ఆన్స్), 2. సుష్మా (కస్తూర్బా గాంధీ), 3. వైష్ణవి (వనితా మహావిద్యాలయ), గాయత్రి (సెయింట్ ట్ ఫ్రాన్సిస్).
52 కేజీ: 1. శ్రావ్య (కస్తూర్బా గాంధీ), 2. మౌనిక (సెయింట్ ట్ ఆన్స్), 3. డి. నిఖిత (వనితా మహావిద్యాలయ), ఎం. సౌమ్య (సెయింట్ ట్ ఫ్రాన్సిస్).
57 కేజీ: 1. అంకితా సింగ్ (కస్తూర్బా గాంధీ), 2. కె. శ్రావణి (వనితా మహావిద్యాలయ), 3. హాసిత (సెయింట్ ట్ ఫ్రాన్సిస్), బి.మనీష (సెయింట్ ఆన్స్ ).
63 కేజీ: 1. శ్రావణి సింగ్ (కస్తూర్బా గాంధీ), 2. ఇషత్ర్ అజీజ్ (సెయింట్ ఆన్స్), 3. జి. మమత (వనితా మహావిద్యాలయ).
70 కేజీ: 1. విన్నీ షరాన్ (ఓయూ మహిళా కాలేజ్), 2. నిఖిత (సెయింట్ ఫ్రాన్సిస్), 3. శివాని (కస్తూర్బా గాంధీ), శ్వేతా సింగ్ (సెయింట్ ఆన్స్).
78 కేజీ: 1. ఆయేషా రజియా (సెయింట్ ఆన్స్), 2. అశ్విని (వనితా మహావిద్యాలయ), 3. శ్రావ్య (సెయింట్ ఫ్రాన్సిస్), ఎం. జ్యోష్న (ఓయూ మహిళా కాలేజ్).
+ 78 కేజీ: 1. సారా నౌషీన్ (సెయింట్ ఆన్స్), 2. హీనా బేగం (కస్తూర్బా గాంధీ), 3. అశ్విని (వనితా మహావిద్యాలయ), ఎల్. శ్రావ్య (ఓయూ మహిళా కాలేజ్).