సింధూపై ప్రశంసల జల్లు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం పీవీ సింధూ కాంస్య పతకం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చదువుతున్న మెహిదీపట్నంలో సెయింట్‌ఆన్స్ మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ విద్యార్థి భారత బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న సింధూ చదువు, ఆట పట్ల ఎంతో సిన్సియర్‌గా ఉంటుందని తెలిపారు.
చదువును నిర్లక్ష్యం చేసేది కాదు
ఎన్ని టోర్నీలకు హాజరైనా సిం ధూ చదువును మాత్రం నిర్లక్ష్యం చేసేది కాదు. తీరిక సమయంలో ప్రత్యేక తరగతులను కూడా తీసుకొనే వాళ్లం. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సంచలనం సృష్టించడం ఎంతో ఆనందం కలిగిస్తోంది.
- విమలారెడ్డి, ఫిజికల్ డెరైక్టర్
గర్వంగా ఉంది..
దేశానికి బ్యాడ్మింటన్‌లో పేరు తెచ్చిన సింధూ మా కాలేజీ విద్యార్థిని కావడం గర్వంగా ఉంది. దేశ కీర్తిని ప్రపంచానికి చాటేలా సింధూ విజేతగా నిలవడం ఆనందంగా ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలి. - ఆంథోనమ్మ, ప్రిన్సిపల్
మరిన్ని విజయాలు సాధించాలి
విద్యార్థి దశలోనే బ్యాడ్మిం టన్‌లో సంచలనం సృష్టిం చిన సింధూ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తుందన్న నమ్మకం ఉంది. భారత బ్యాడ్మింటన్‌కు ఆదర్శంగా నిలిచేలా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆట తీరు ప్రదర్శించింది.
- బాలమరిరెడ్డి, లైబ్రేరియన్ హెడ్