india badminton
-
థామస్ ఉబర్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్
-
ఇంకోటి గెలిస్తే చరిత్ర
జకార్తా: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్ ఇలా అత్యున్నత వేదికలపై మహిళల సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ పతకాలు కొల్లగొట్టారు. అయితే ఆసియా క్రీడల్లో మాత్రం సింగిల్స్ విభాగం పతకం ఈ ఇద్దరు స్టార్స్‌కే కాకుండా భారత్‌కూ అందని ద్రాక్షగా ఉంది. కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు ఆ కొరత తీర్చుకునేదిశగా మరో అడుగు ముందుకేశారు. ఆసియా క్రీడల్లో భాగంగా సింధు, సైనా మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–12, 21–15తో గ్రెగోరియా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై... సైనా 21–6, 21–14తో ఫిత్రియాని (ఇండోనేసియా)పై గెలుపొందారు. నేడు జరిగే క్వార్టర్లో రచనోక్ (థాయ్ లాండ్)తో సైనా; జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే పతకాలు ఖాయమవుతాయి. పోరాడి ఓడిన సుమీత్ జంట... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్లో... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాయి. సిక్కి–అశ్విని ద్వయం 11–21, 22–24తో మూడో సీడ్ చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ జంట చేతిలో ఓడిపోయింది. సాత్విక్–చిరాగ్ 17–21, 21–19, 17–21తో చోయ్ సొల్గు–మిన్ హుక్ కాంగ్ (కొరియా) చేతిలో... సుమీత్–మనూ అత్రి 13–21, 21–17, 23–25తో రెండో సీడ్ లి జున్హుయ్–లియు యుచెన్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. సుమీత్ జంట నిర్ణాయక మూడో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. -
పోరాడి ఓడిన కశ్యప్
-
పోరాడి ఓడిన కశ్యప్
జకర్తా: ఇండోనేసియా ఓపెన్‌లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో కశ్యప్ ఓటమి చెందాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించిన కశ్యప్.. శనివారం హోరాహోరీగా సాగిన సెమీస్‌లో 21-12, 17-21, 19-21 స్కోరుతో జపాన్ షట్లర్ కెంటో మొమోట చేతిలో పోరాడి ఓడాడు. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన సెమీస్ పోరులో కశ్యప్ తొలి గేమ్‌ను సునాయాసంగా గెల్చుకున్నాడు. కాగా రెండో గేమ్‌లో కశ్యప్ వెనుకబడటంతో మ్యాచ్ 1-1తో సమమైంది. చివరి, నిర్ణాయక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. కశ్యప్ చివరి వరకు పోరాడినా కొద్దిలో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. -
సై అంటే సై...
ఆరు ఫ్రాంచైజీలు... ఆరు వేదికలు... ప్రత్యర్థులుగా మారనున్న సహచరులు... అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రీడాకారులతో కలిసి ఆడే అవకాశం... కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ... మొత్తానికి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రూపంలో బుధవారం బ్యాడ్మింటన్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. 15 రోజులపాటు జరిగే ఈ బ్యాడ్మింటన్ పండుగకు రంగం సిద్ధమైంది. ఇక ఆస్వాదించడమే తరువాయి...! న్యూఢిల్లీ: ఆరంభ విఘ్నాలను అధిగమించిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారం న్యూఢిల్లీలో మొదలయ్యే ఈ లీగ్ ఈనెల 31న ముంబైలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సైనా నెహ్వాల్, సింధు, కశ్యప్, శ్రీకాంత్, సాయిప్రణీత్, గురుసాయిదత్ తదితర భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తుండటంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో జరుగుతోన్న ఈ లీగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఈ లీగ్ విజయవంతమైతే మున్ముందు భారత్‌లో బ్యాడ్మింటన్ ప్రధాన క్రీడగా ఎదిగే అవకాశముంది. ఫేవరెట్ ఎవరో? లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ లీగ్‌లో తొలిసారి విజేతగా ఎవరు నిలుస్తారో ఊహించడం కాస్త కష్టంగానే ఉంది. ఆరు జట్ల నుంచి నాలుగు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి కాబట్టి చివరి లీగ్ మ్యాచ్ వరకు ఏ ఏ జట్లు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటాయో వేచి చూడాలి. ఆయా జట్ల సమీకరణాలను పరిశీలిస్తే... హైదరాబాద్ హాట్‌షాట్స్, అవధ్ వారియర్స్, పుణే పిస్టన్స్, ముంబై మాస్టర్స్ సెమీఫైనల్ చేరుకునే అవకాశముంది. అయితే బంగా బీట్స్, ఢిల్లీ స్మాషర్స్ జట్లనూ తక్కువ అంచనా వేయలేం. ఒక్కో పోటీల్లో మూడు సింగిల్స్ మ్యాచ్‌లు ఉన్నందున డబుల్స్ మ్యాచ్‌లు కూడా కీలకమయ్యే అవకాశాలున్నాయి. లీ చోంగ్ వీ అనుమానం! చైనా నుంచి దాదాపు అగ్రశ్రేణి క్రీడాకారులందరూ ఈ లీగ్‌కు దూరంగా ఉన్నారు. దాంతో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ఈ లీగ్‌కు ప్రధాన ఆకర్షణ అయ్యాడు. అయితే గత ఆదివారం లిన్ డాన్ (చైనా)తో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా లీ చోంగ్ వీ మోకాలి గాయంతో వైదొలిగాడు. నొప్పి తీవ్రంగా ఉండటంతో అతణ్ని మైదానంలో నుంచి స్ట్రెచర్‌పై నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో లీ చోంగ్ వీ ఐబీఎల్‌లో బరిలోకి దిగుతాడో లేదో అనుమానంగా మారింది. ప్రతి పోటీలో ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో రెండు పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లతోపాటు ఒక్కో మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లుంటాయి. ప్రతి మ్యాచ్ ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ గేమ్స్ పద్ధతిలో జరుగుతుంది. తొలుత 21 పాయింట్లు సాధించిన వారికి గేమ్ దక్కుతుంది. చెరో గేమ్ గెల్చుకుంటే నిర్ణాయక మూడో గేమ్‌లో మొదట 11 పాయింట్లు నెగ్గినవారు విజేతగా నిలుస్తారు. తొలి రెండు గేమ్‌ల్లో 7వ పాయింట్, 14వ పాయింట్ ముగిశాక నిమిషం చొప్పున విరామాలు ఉంటాయి. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం ఆరో పాయింట్ ముగిశాక ఈ విరామం ఉంటుంది. 8 ప్రతి ఫ్రాంచైజీ జట్టులో 11 ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో నలుగురు విదేశీ ఆటగాళ్లు... ఆరుగురు భారత క్రీడాకారులు... ఒకరు జూనియర్ ఇండియా జట్టు సభ్యుడు ఉంటారు. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఒక జట్టు ఒక పోటీని 5-0తో గెలిస్తే ఆ జట్టుకు బోనస్ పాయింట్‌తో కలిపి మొత్తం ఆరు పాయింట్లు లభిస్తాయి. 4-1తో గెలిస్తే ఐదు పాయింట్లు... 3-2తో గెలిస్తే నాలుగు పాయింట్లు వస్తాయి. రూ. 6.13 కోట్లు మొత్తం ప్రైజ్‌మనీ 10 లక్షల డాలర్లు. విజేత జట్టుకు 65 శాతం... రన్నరప్ జట్టుకు 35 శాతం ప్రైజ్‌మనీ ఇస్తారు. ఐబీఎల్‌లో నేడు ఢిల్లీ x స్మాషర్స్ పుణే పిస్టన్స్ రా. గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్ సా. గం. 6.30కు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది -
ఇకపై ప్రతీ మ్యాచ్ కఠినమే!
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో తన ఆటను మరింత మెరుగు పర్చుకోవాల్సి ఉందని, అప్పుడే పెద్ద విజయాలు తన ఖాతాలో చేరతాయని భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గడం గర్వంగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. వరల్డ్ చాంపియన్‌షిప్ అనంతరం నగరానికి చేరుకున్న సింధు... మంగళవారం గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం చాలా సంతోషంగా ఉంది. సెమీస్‌లో ఓడినా ఎలాంటి బాధా లేదు. ఇకపై నా ఆటలో లోపాలను సరిదిద్దుకొని మరింత మెరుగవ్వాలి. ప్రతీ మ్యాచ్ నాకు కఠినం కానుంది. నేను బాగా ఆడతాననే విశ్వాసంతో ఉన్నాను’ అని సింధు పేర్కొంది. రత్చనోక్ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తాను ఎలాంటి ఒత్తిడినీ ఎదుర్కోలేదని, ప్రత్యర్థి బాగా ఆడటం వల్లే ఓడానని చెప్పింది. ‘నేను ఆరంభంలోనే కొన్ని తప్పులు చేయడంతో ఆమె భారీ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. నేను కొంత నెగెటివ్ గేమ్ ఆడాను. యితే రత్చనోక్ చాలా బాగా ఆడటంతో నేను కోలుకోలేకపోయాను’ అని సింధు విశ్లేషించింది. సైనా అద్భుతమైన క్రీడాకారిణి అని, కోర్టులో ఆమె దూకుడు తనకిష్టమని ఈ యువ షట్లర్ అభిప్రాయ పడింది. తన విజయం పట్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారని, ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించడం నాన్న రమణ నుంచే అలవాటైందని ఆమె చెప్పడం విశేషం. కోర్టులో సుదీర్ఘంగా సాధన చేయడాన్ని తాను ఇబ్బందిగా భావించడం లేదని, అది కోచ్ గోపీచంద్‌పైనే ఆధారపడి ఉంటుందని సింధు చెప్పింది. ‘నాకు ఎన్ని గంటల శిక్షణ ఇచ్చినా అది నా కోసమే. కాబట్టి ఇష్టంతోనే కష్ట పడుతున్నాను. అలా చేస్తేనే నా తప్పులను సరిదిద్దుకోగలను. భవిష్యత్తులో రత్చనోక్‌ను ఓడించాలంటే ఇది అవసరం. ఆట వల్ల నేనేమీ కోల్పోవడం లేదు. ప్రస్తుతం ఒక్కో టోర్నీలో ప్రదర్శనపై దృష్టి పెట్టాను. గోపీ సర్ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళతాను’ అని సింధు స్పష్టం చేసింది. ‘సైనా ఒలింపిక్ మెడల్ నెగ్గి సరిగ్గా ఏడాది అయింది. ఇప్పుడు సింధు రూపంలో మళ్లీ మేం సంబరాలు జరుపుకుంటున్నాం. అయితే సైనా విజయాన్ని దీంతో పోల్చడం నాకిష్టం లేదు. సింధు అద్భుతంగా ఆడింది. భవిష్యత్తులో ఈ ప్రదర్శన ఇంకా మెరుగవుతుంది. అద్భుతమైన ఫిట్నెస్ కూడా సింధు విజయంలో కీలక పాత్ర పోషించింది. చైనాను అడ్డుకునేందుకు ఇప్పుడు ప్రతీ దేశం వ్యూహాలు పన్నుతోంది. అప్పుడు మరో వైపునుంచి పోటీ ఎదురువుతుంది. థాయిలాండ్‌నుంచి ఇప్పుడు టాప్-20లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో ఎక్కువగా దేశవాళీ టోర్నీలు లేకపోవడం వల్ల సైనా, సింధు ప్రత్యర్థులుగా తలపడే అవకాశం పెద్దగారాలేదు. ఇకపై అంతర్జాతీయ స్థాయిలో అది జరుగుతుంది. అయితే చివరకు భారత్‌కు పతకం రావడమే ముఖ్యం. ఆ దిశగా శ్రమిస్తున్నాం’ -పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
సింధుకు ఉజ్వల భవిష్యత్
సాక్షి క్రీడావిభాగం సైనా తర్వాత ఎవరు? అన్న ప్రశ్నకు సింధు రూపంలో సమాధానం దొరికింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ తెలుగుతేజం ప్రదర్శన చూశాక భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతుందనే నమ్మకం కలిగింది. ఇన్నాళ్లూ భారత బ్యాడ్మింటన్ అంటే ప్రధానంగా సైనా పేరును ప్రస్తావించేవారు. ఇక నుంచి ఈ ఇద్దరి పేర్లూ వినిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకంతో సింధు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మాయి పదేళ్ల కఠోర శ్రమకు ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఒక్క ఘనతతో సింధును అగ్రశ్రేణి క్రీడాకారిణుల జాబితాలో చేర్చడం తొందరపాటే అవుతుంది. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఈ హైదరాబాద్ అమ్మాయి ఇంకా రాటుదేలాల్సి ఉంది. స్టార్‌గా ఎదగాలంటే సింధు ఆటతీరు మెరుగుపడాల్సిన అవసరముందని రత్చనోక్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌తో రుజువైంది. దూకుడుగా ఆడే చైనీయుల ఆటతీరుకు సింధు శైలి సరిపోతుంది. కానీ ప్రత్యర్థి బలాబలాలను బేరీజు వేసి సందర్భాన్నిబట్టి ఆడే రత్చనోక్లాంటి క్రీడాకారిణులను ఓడించాలంటే ఫిట్నెస్... షాట్లలో వైవిధ్యం... మానసిక దృఢత్వం... ఇలా పలు అంశాల్లో రాటుదేలాల్సిన అవసరం ఉంది. గత ఏప్రిల్‌లో మోకాలి గాయం కారణంగా రెండు నెలలపాటు సింధు ఆటకు దూరమైంది. సింధు ఇంకా నేర్చుకునేదశలోనే ఉందని ఆమె పరిపూర్ణ క్రీడాకారిణిగా మారాలంటే మరో రెండేళ్లు పడుతుందని ఇటీవల చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. సింధు పూర్తి ఫిట్నెస్తో ఉంటే... సహజశైలిలో ఆడితే... ఎలాంటి ఫలితాలు వస్తాయో తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనిపించింది. ఒకట్రెండు విజయాలతో ఉప్పొంగిపోకుండా తన కెరీర్ మరింత ఉజ్వలంగా మారాలంటే సింధు ఆటతీరులో స్థిరత్వం కనిపించాలి. అప్పుడే మరిన్ని విజయాలు వస్తాయి. -
సింధూపై ప్రశంసల జల్లు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం పీవీ సింధూ కాంస్య పతకం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చదువుతున్న మెహిదీపట్నంలో సెయింట్‌ఆన్స్ మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థి భారత బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న సింధూ చదువు, ఆట పట్ల ఎంతో సిన్సియర్‌గా ఉంటుందని తెలిపారు. చదువును నిర్లక్ష్యం చేసేది కాదు ఎన్ని టోర్నీలకు హాజరైనా సిం ధూ చదువును మాత్రం నిర్లక్ష్యం చేసేది కాదు. తీరిక సమయంలో ప్రత్యేక తరగతులను కూడా తీసుకొనే వాళ్లం. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సంచలనం సృష్టించడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. - విమలారెడ్డి, ఫిజికల్ డెరైక్టర్ గర్వంగా ఉంది.. దేశానికి బ్యాడ్మింటన్‌లో పేరు తెచ్చిన సింధూ మా కాలేజీ విద్యార్థిని కావడం గర్వంగా ఉంది. దేశ కీర్తిని ప్రపంచానికి చాటేలా సింధూ విజేతగా నిలవడం ఆనందంగా ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలి. - ఆంథోనమ్మ, ప్రిన్సిపల్ మరిన్ని విజయాలు సాధించాలి విద్యార్థి దశలోనే బ్యాడ్మిం టన్లో సంచలనం సృష్టిం చిన సింధూ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తుందన్న నమ్మకం ఉంది. భారత బ్యాడ్మింటన్‌కు ఆదర్శంగా నిలిచేలా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆట తీరు ప్రదర్శించింది. - బాలమరిరెడ్డి, లైబ్రేరియన్ హెడ్ -
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పతకం ఖాయం
-
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పతకం ఖాయం
-
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పతకం ఖాయం
కలయా... నిజమా... గురువు పుల్లెల గోపీచంద్‌తో సాధ్యం కానిది.... తన ఆదర్శ క్రీడాకారిణి సైనాకు అందని ద్రాక్షగా ఉన్న ఘనతని... తన తొలి ప్రయత్నంలోనే పూసర్ల వెంకట సింధు సాధించింది. 18 ఏళ్ల ఈ అచ్చ తెలుగు అమ్మాయి శుక్రవారం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. చైనా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లో చైనా ప్లేయర్‌నే చిత్తు చేసి ‘డ్రాగన్’ పీచమణిచింది. ప్రతిష్టాత్మక ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో మహిళల సింగిల్స్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ‘మాకు తిరుగులేదు అని కాలర్ ఎగిరేసే చైనీయుల కుంభస్థలం మీద కొట్టాలనుకుందో’... ‘అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచిపోయిన సైనా, కశ్యప్‌ల బాధను కాస్తయినా తగ్గించాలనుకుందో’.. ‘అపర ద్రోణుడిలా అహర్నిశలు శ్రమిస్తున్న గురువు గోపీచంద్‌కు అద్భుత కానుక ఇవ్వాలనుకుందో’... మొత్తానికి తెలుగు తేజం పి.వి. సింధు అద్భుతమే చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా... బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. గురువారం మూడో రౌండ్లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్, రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)పై సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ ఈ 18 ఏళ్ల అమ్మాయి మరో సంచలనం సృష్టించింది. అశేష చైనా అభిమానుల నడుమ ఒత్తిడిని తట్టుకుంటూ మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 10వ సీడ్ సింధు 21-18, 21-17తో 7వ సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ చేరినవారికి కనీసం కాంస్య పతకం లభిస్తుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. ఇంతనోన్‌తో ముఖాముఖిలో సింధు 0-1తో వెనుకబడి ఉంది. ఆద్యంతం ఆధిపత్యం.... ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనీస్ తైపీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో షిజియాన్ వాంగ్‌ను ఓడించిన సింధు అదే ఫలితాన్ని ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పునరావృతం చేసింది. సొంతగడ్డపై ఆడుతున్న షిజియాన్‌కు ప్రేక్షకుల మద్దతు లభించినా సింధు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోకుండా తన ప్రణాళికను అమలు చేసింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ... అడపాదడపా స్మాష్ షాట్లు సంధిస్తూ... సింధు ఆరంభం నుంచి మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి గేమ్ ఆరంభంలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 6-3తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత దీనిని కాపాడుకుంది. షిజియాన్ తేరుకునే ప్రయత్నం చేసినా సింధు ఏదశలోనూ సంయమనం కోల్పోకుండా చైనా స్టార్‌ను కట్టడి చేసింది. రెండో గేమ్ ఆరంభంలో సింధు మరోసారి చెలరేగింది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 6-2తో ముందంజ వేసింది. ఈ నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని తగ్గించాలని, స్కోరును సమం చేయాలని షిజియాన్ కృషి చేసినా ఆమె ఆటలు సింధు ముందు సాగలేదు. మూడో పతకం...: సింధు సెమీఫైనల్‌కు చేరుకోవడంతో ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఖాతాలో మూడో పతకం చేరనుంది. 30 ఏళ్ల క్రితం 1983లో డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో దిగ్గజం ప్రకాశ్ పదుకొనే సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించారు. మూడు దశాబ్దాల తర్వాత సింధు ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి ప్రకాశ్ పదుకొనే సరసన నిలిచింది. 2011లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించింది. సైనా... నాలుగో‘సారీ’ గ్వాంగ్జూ (చైనా): అన్నీ కలిసొచ్చాయి. కానీ ఆటతీరే బాగోలేదు. ఫలితంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది మరోసారి నిరాశపరిచింది. అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని గెల్చుకోవడంతో ఈ హైదరాబాద్ అమ్మాయి నాలుగోసారీ విఫలమైంది. గత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2009-హైదరాబాద్), (2010-పారిస్), (2011-లండన్) క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్ర్కమించిన సైనా నాలుగోసారీ ఈ అడ్డంకిని దాటలేకపోయింది. సెమీఫైనల్ చేరుకుంటే కనీసం కాంస్య పతకం ఖాయమయ్యే స్థితిలో బరిలోకి దిగిన సైనా ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. స్థాయికితగ్గ ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమై రిక్తహస్తాలతో తిరిగిరానుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సైనా 21-23, 9-21తో 13వ సీడ్ యోన్ జూ బే (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో ఆకట్టుకున్నా రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. తొలి గేమ్‌లో 14-7తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న సైనా ఆ తర్వాత అనవసర తప్పిదాలతో తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చింది. 21-20తో గేమ్ పాయింట్ వద్ద నిలిచిన సైనా వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. రెండో గేమ్‌లో సైనా ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆరంభంలో 5-4తో ఆధిక్యంలో ఉన్నా మళ్లీ తడబడింది. వరుసగా ఐదు పాయింట్లు సమర్పించుకొని 5-9తో వెనుకబడింది. ఆ తర్వాత స్కోరు 9-14 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా ఏడు పాయింట్లు కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. ‘వరుసగా సింధు రెండు కఠినమైన మ్యాచ్‌లు ఆడింది. సెమీస్ ప్రత్యర్థి కూడా బలమైన క్రీడాకారిణి. సింధు రాణిస్తుందనే నమ్మకం ఉంది. ఓవరాల్‌గా సింధు అద్భుతంగా ఆడుతోంది. సైనాకు ఆరోగ్యం సరిగా లేదు. అందుకే తొలి గేమ్ తర్వాత శక్తిని కోల్పోయింది. ఆమె వయసు కేవలం 23 ఏళ్లే. కాబట్టి పుంజుకుంటుంది. మంచి నైపుణ్యం ఉన్న క్లాస్ ప్లేయర్ సైనా. తన కెరీర్‌కు వచ్చిన నష్టమేమీ లేదు.’ - కోచ్ గోపీచంద్ గోపీచంద్‌కు అంకితం ‘సింధు ఘనత పట్ల మేం గర్విస్తున్నాం. డ్రా కఠినంగా ఉండటం వల్ల తనపై మాకు ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్‌కు చేరడం అనేది మేం ఊహించని గొప్ప ఘనత. సింధు విషయంలో గోపీచంద్ సపోర్ట్ స్టాఫ్‌ను బాగా వినియోగించారు. సింధు విజయాల్లో గోపీ కృషిని మరువలేం. ఈ విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నాం. ఎత్తు ఎక్కువ ఉండటం సింధు బలం. ఎవ్వరికీ భయపడదు. ప్రత్యర్థి ఎవరైనా నా ఆట నేను ఆడతా అంటుంది. ఈ దృక్పథం వల్లే చైనా క్రీడాకారిణులను ఓడిస్తోంది’. - పి.వి.రమణ, విజయ (సింధు తల్లిదండ్రులు) ప్రశంసల వెల్లువ సింధుపై అభినందనల వర్షం కురిసింది. ‘ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచే సత్తా ఆమెలో ఉంది.ఆల్ ది బెస్ట్ సింధు’ అంటూ భారత బ్యాడ్మింటన్ సమాఖ్య అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా అభినందించారు. దేశంలో బ్యాడ్మింటన్‌కు ప్రధానకేంద్రంగా మారిన హైదరాబాద్ నుంచి మరో క్రీడాకారిణి సంచలనం సృష్టించడం గర్వకారణమని... ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పున్నయ్యచౌదరి అన్నారు. పాపం... కశ్యప్ మ్యాచ్ పాయింట్ చేజార్చుకొని ఓటమి ఒక్క పాయింట్ సాధించి ఉంటే చరిత్ర సృష్టించే అవకాశాన్ని పారుపల్లి కశ్యప్ చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ కశ్యప్ 21-16, 20-22, 15-21తో మూడో సీడ్ డూ పెంగ్యూ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ పోటీలో కశ్యప్ తొలి గేమ్‌ను నెగ్గి రెండో గేమ్‌లో 20-19తో మ్యాచ్ పాయింట్‌ను సంపాదించాడు. ఈ దశలో పాయింట్ సాధించి ఉంటే కశ్యప్ విజయం సాధించడంతోపాటు సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకునేవాడు. కానీ డూ పెంగ్యూ పట్టుదలతో పోరాడి మ్యాచ్ పాయింట్‌ను కాచుకోవడమేకాకుండా రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ ఒకదశలో 12-8తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. వరుసగా ఏడు పాయింట్లు సమర్పించుకొని 12-15తో వెనుకబడిపోయాడు. ఆ తర్వాత కశ్యప్ తేరుకోలేకపోయాడు. ఏకకాలంలో.... శుక్రవారం సైనా నెహ్వాల్, కశ్యప్ మ్యాచ్‌లు ఏకకాలంలో పక్క పక్క కోర్టుల్లో జరిగాయి. కశ్యప్ తొలి గేమ్‌ను సొంతం చేసుకునేసరికి సైనా తన తొలి గేమ్‌లో ఆధిక్యంలో ఉంది. రెండో గేమ్‌లో కశ్యప్ 0-7తో వెనుకబడి ఆ తర్వాత కోలుకున్నాడు. ఒకదశలో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 18-16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత కశ్యప్ మ్యాచ్ పాయింట్ సంపాదించాడు. అదే దశలో సైనా కూడా గేమ్ పాయింట్‌ను సంపాదించింది. కానీ కశ్యప్ మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకోలేకపోయాడు. సైనా కూడా గేమ్‌ను దక్కించుకోలేకపోయింది. -
ఈసారి భారత స్టార్‌కు మంచి అవకాశం
జూనియర్ ప్రపంచ చాంపియన్ టైటిల్... సూపర్ సిరీస్ టోర్నీలోనూ విజయాలు... కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ పతకం... ఒలింపిక్స్‌లో కాంస్యం... దాదాపు అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలు సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఖాతాలో ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం లోటుగా కనిపిస్తోంది. గత మూడు పర్యాయాలు ఈ హైదరాబాద్ అమ్మాయి పతకానికి విజయం దూరంలో ఉండిపోయింది. నాలుగోసారైనా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించి ‘చాంపియన్’గా నిలుస్తుందో? లేదో? వేచిచూడాలి. గ్వాంగ్జూ (చైనా): ఈ ఏడాదిలో ఒక్క టైటిల్‌ను గెలువలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో పరీక్షకు సిద్ధమైంది. సోమవారం మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పతకం సాధించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం పకడ్బందీగా సిద్ధమైన సైనాకు ఈసారి అనుకూలమైన ‘డ్రా’నే పడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న సైనాకు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం ఊరిస్తోంది. హైదరాబాద్ (2009), పారిస్ (2010), లండన్ (2011)లలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సైనా క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. ఈ ప్రతిష్టాత్మక పోటీల నిబంధనల ప్రకారం సెమీఫైనల్స్‌కు చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఇప్పటివరకు ఈ పోటీల చరిత్రలో భారత్‌కు వచ్చిన రెండు పతకాలు కాంస్యాలే కావడం గమనార్హం. 1983లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్‌లో... 2011లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. బుధవారం బరిలోకి... సోమవారం ఈ పోటీలు ప్రారంభమవుతున్నా సైనా మాత్రం తన తొలి మ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. నాలుగోసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న ఈ హైదరాబాద్ అమ్మాయికి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఓల్గా గొలోవనోవా (రష్యా) లేదా అలీసియా జైత్సావా (బెలారస్)లలో ఒకరితో సైనా ఆడుతుంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే మూడో రౌండ్లో ఆమెకు 15వ సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్) లేదా జేమీ సుబంధి (మలేసియా) ఎదురవుతారు. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో సైనాకు ప్రత్యర్థిగా ఎనిమిదో సీడ్ మినత్సు మితాని (జపాన్) లేదా సయాకా తకహాషి (జపాన్) లేదా 13వ సీడ్ యోన్ జూ బే (దక్షిణ కొరియా) లేదా త్సాజ్ కా చాన్ (హాంకాంగ్)లలో ఒకరుంటారు. ఈ అవరోధాన్ని అధిగమించి సెమీఫైనల్‌కు చేరుకుంటే సైనాకు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. అంతా సజావుగా సాగితే సెమీఫైనల్లో సైనాకు టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) ఎదురయ్యే అవకాశముంటుంది. మరో పార్శ్వం నుంచి రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా), నాలుగో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధుకు కూడా తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో యశ్వందరి (ఇండోనేసియా) లేదా ఇమబెపు (జపాన్)లలో ఒకరితో సింధు ఆడుతుంది. తొలిసారి భారీ బృందం ఈ పోటీల చరిత్రలో భారత్ తొలిసారి ఐదు విభాగాల్లో (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) రెండేసి ఎంట్రీలను పంపించే అర్హతను సంపాదించింది. భారత్ నుంచి మొత్తం 11 మంది పోటీపడుతుండగా ఇందులో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులే కావడం విశేషం. మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు... పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్... పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో కోనా తరుణ్... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి రాష్ట్రానికి చెందినవారు. కశ్యప్ ఁ రౌల్ తొలి రోజున భారత నంబర్‌వన్, ప్రపంచ 13వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 98వ ర్యాంకర్ రౌల్ మస్త్ (ఎస్తోనియా)తో; వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)తో అజయ్ జయరామ్ పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్-అశ్విని పొన్నప్ప జంట హషిమోటో-మియూకి మయెదా (జపాన్) జోడితో; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-అపర్ణ బాలన్ జోడి లారెన్ స్మిత్-గాబ్రియెలా వైట్ (ఇంగ్లండ్) జంటతో ఆడతాయి.