జకర్తా: ఇండోనేసియా ఓపెన్లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ సెమీస్లో కశ్యప్ ఓటమి చెందాడు. క్వార్టర్స్లో ప్రపంచ నెంబర్ వన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించిన కశ్యప్.. శనివారం హోరాహోరీగా సాగిన సెమీస్లో 21-12, 17-21, 19-21 స్కోరుతో జపాన్ షట్లర్ కెంటో మొమోట చేతిలో పోరాడి ఓడాడు.
ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన సెమీస్ పోరులో కశ్యప్ తొలి గేమ్ను సునాయాసంగా గెల్చుకున్నాడు. కాగా రెండో గేమ్లో కశ్యప్ వెనుకబడటంతో మ్యాచ్ 1-1తో సమమైంది. చివరి, నిర్ణాయక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. కశ్యప్ చివరి వరకు పోరాడినా కొద్దిలో మ్యాచ్ను చేజార్చుకున్నాడు.
పోరాడి ఓడిన కశ్యప్
Published Sat, Jun 6 2015 2:32 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM