
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యూకే స్ట్రెయిన్(రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్) కేసులు పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. బుధవారం రాసిన ఈ లేఖలో కేంద్రం న్యూ స్ట్రెయిన్ కేసులు పెరగకుండా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇందుకోసం కేంద్రం రేపు, ఎల్లుండి జరిగే కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు సూచించింది. కాగా బ్రిటన్‌లో కొత్త వైరస్ న్యూ స్ట్రెయిన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం ఆంక్షలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీ వరకు ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గోలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment