
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ పై హైకోర్టులో ఉన్న స్టేటస్ కో ఎత్తేయడానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను పీఆర్‌టీయూటీఎస్ నేతలు కోరారు. ఆగస్టు 1న జరగనున్న విచారణలో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఈ మేరకు ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌ను ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, పీఆర్‌టీయూటీఎస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు కలిశారు.