హైకోర్టు విభజన వేగవంతం చేయండి
హైకోర్టు విభజన వేగవంతం చేయండి
Published Wed, Jul 26 2017 12:16 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు కేసీఆర్ విజ్ఞప్తి
- తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజనను వేగవంతం చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణ అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టాలని, ఆలస్యమైతే 2019 ఎన్నికల్లోపు ప్రక్రియ పూర్తవదని విన్నవించారు. మంగళవారం ఢిల్లీలో నూతన రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కేసీఆర్, మధ్యాహ్నం రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఇటీవల రాజ్‌నాథ్ కాలికి గాయమైన నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు విజ్ఞప్తులు చేశారు.
త్వరగా నిర్ణయం తీసుకోండి
తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పున ర్విభజన ఆవశ్యకతను రాజ్‌నాథ్‌కు కేసీఆర్ వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్ల మెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లు పెట్టాలని కోరారు. త్వరితగతిన రాజకీ య నిర్ణయం తీసుకుని.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ ను ప్రారంభించాలని విన్నవించారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీయే అయినందున.. బిల్లు ఆమోదంలో అడ్డంకులు ఎదురుకాబోవని ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు రోజులు ఢిల్లీలోనే కేసీఆర్
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రక్షణ, ఆర్థిక శాఖలకు సంబంధించి పలు పెండింగ్ వినతులపై బుధ వారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కేసీఆర్ కలవనున్నారు. వీలైతే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రిని కూడా కలుస్తారని సమాచారం.
ఐపీఎస్‌లను కేటాయించండి
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేప థ్యంలో తగిన సంఖ్యలో ఐపీఎస్‌లను కేటా యించాలని రాజ్‌నాథ్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మంజూరైన కేడర్‌లోనే ఖాళీలు ఉం డగా.. కొత్త జిల్లాల ఏర్పాటుతో మరింత కొర త ఏర్పడిందన్నారు. హైకోర్టు విభజన ప్రక్రి య వేగవంతం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను పరిష్కరించాల్సిన బాధ్యత కేం ద్రంపై ఉందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాం తాల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు ఉన్నారు.
Advertisement