
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్... హైకోర్టు విభజన, కొత్త జోనల్ వ్యవస్థ ఆమోదం తదితర అంశాలపై చర్చించడం తెలిసిందే. ఆదివారం తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ సోమవారం కేంద్ర హోంమంత్రితో సమావేశమై రాష్ట్ర విభజన చట్టంలోని హామీలైన హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. అలాగే ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకుంటున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కేసీఆర్ పరామర్శిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment