న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్న్ వీడియోలను అరికట్టడానికి సీబీఐ కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్‌పై కొరడా ఘుళిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసిన సీబీఐ 14 రాష్ట్రాల్లో 76 ప్రాంతాల్లో దాడులు చేస్తోంది.
నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, పంజాబ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో సోదాలో నిర్వహించడంతో పాటు ఇప్పటికే పలు వీడియోలను కూడా సీజ్ చేసింది. చిన్నారుల పోర్న్ వీడియోలను చూడటం, డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేయడం లాంటివాటిని కేంద్రం నిషేదించిన సంగతి తెలిసిందే.
In a major crackdown, CBI is today conducting searches at around 76 locations across India in 14 States/UTs.
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) November 16, 2021
CBI has registered 23 separate cases on 14th November 2021 against total 83 accused on the allegations related to Online Child Sexual Abuse & Exploitation.
చదవండి: కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా..
Comments
Please login to add a commentAdd a comment