సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పన్నులు ఆదాయాలలో కేంద్ర, రాష్ట్రాల వాటాలను నిర్ణయించే 15వ ఆర్థిక కమిషన్ తన తుది వేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందించింది. ఎన్‌కే సింగ్ నేతృత్వంలోని కమిషన్ 2022-26 వరకు సంబంధించిన సిఫారసులను సోమవారం సమర్పించింది. కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 42 శాతం నిధుల బదలాయింపును తగ్గిస్తూ సిఫారసులు చేసింది. కోవిడ్-19 సంక్షోభం, భారీగా క్షీణించిన ఆదాయాలు నేపథ్యంలో సంఘం సిఫారసులను ప్రభావితం చేసినట్టు అంచనా.
ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను లోతుగా కమిషన్ విశ్లేషించిందనీ, అలాగే ప్రధానంగా ఆఆయార రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లను పరిష్కరించేందుకు నిర్దిష్ట పరిశీలన చేసినట్టు సమాచారం. 'ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్' పేరుతో ఈ నివేదికను సమర్పించింది. అంతకుముందు 10శాతం పెంపుతో కేంద్ర పన్ను వసూళ్లలో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అయితే 15వ ఆర్ధిక సంఘం దీనికి భిన్నంగా 2020-21సంవత్సరానికి 41 శాతం రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అలాగే దీనికి ఒక శాతం తగ్గింపు (41 శాతం)తో కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్, లడాఖ్‌కు చెల్లించాలని చెప్పింది. దీంతో నిధుల్లో తగ్గుదల వల్ల అనేక రాష్ట్రాలు చేపడుతున్న సంక్షేమ పథకాలకు గట్టి దెబ్బ పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయ నిధుల కేటాయింపు సిఫారసులతోపాటు వచ్చే ఐదేళ్ళలో కేంద్రానికి ఆర్థిక ఏకీకరణ దిశగా ఒక మార్గాన్ని రూపొందించాలని కూడా కేంద్రానికి సిఫారసు చేసింది. రక్షణ, అంతర్గత భద్రతకు నిధులు సమకూర్చడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని అలాంటి, యంత్రాంగాన్ని ఎలా అమలు చేయవచ్చో కూడా పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.
2019-20లో కేంద్రం రూ .21.6 ట్రిలియన్లు వసూలు చేస్తుందని అంచనా వేయగా, (సవరించిన అంచనాలు) కాని రాష్ట్రాల వాటా కేవలం రూ .6.6 ట్రిలియన్లుగా ఉంది. ఇది మొత్తం పన్ను మొత్తంలో కేవలం 30.3 శాతం మాత్రమే. 14 వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఇది 42 శాతంగా ఉండాలి. కేంద్రం రాష్ట్రాలు కలిపి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో 2.5 శాతం ఆరోగ్య రంగానికి ఖర్చు చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్టు తెలేస్తోంది. ప్రస్తుతం, వారు 0.9 శాతం మాత్రమే. 0.3 శాతం కేంద్రం నుండి 0.6 రాష్ట్రాల నుండి వెచ్చిస్తున్నాయి.
అనేక ప్రత్యేకమైన, విస్తృత సమస్యలపై కమిషన్ తన సిఫారసులను ఇవ్వమని కమిషన్ కోరింది. వివిధ పన్నుల పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ నిధులు కాకుండా, విద్యుత్ రంగం, డీబీటీ స్వీకరణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్ కోరినట్టు తెలుస్తోంది. ఈ నివేదిక కాపీని ఈ నెలాఖరుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేస్తారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి సమర్పించే కేంద్ర బడ్జెట్‌తోపాటు, ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టేవరకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment