ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ,తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో దేశంలోని 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో 115.5 నుంచి 204.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సమయంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలున్నాయని తెలిపింది.
సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దేశంలో కొన్ని రాష్ట్రాలకు వాతావరణశాఖ హీట్‌వేవ్ హెచ్చరికను కూడా జారీ చేసింది. పంజాబ్, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. గత 24 గంటల్లో జైసల్మేర్ (పశ్చిమ రాజస్థాన్)లో అత్యధికంగా 45.0 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, ఎన్‌సీఆర్, తూర్పు యూపీ, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment