న్యూఢిల్లీ: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గత 121 ఏళ్లలో రెండో అత్యధిక వర్షంపాతం మే నెలలో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ గురువారం తన నివేదికలో తెలిపింది. మేలో కురిసిన రికార్డు వర్షపాతానికి.. క్రితం సంభవించిన టౌటే, యాస్ తుపానుల ప్రభావము, పాశ్చాత్య అవాంతరాలు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక దేశవ్యాప్తంగా 2021 మేలో 107.9 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. ఇది సాధారణం నమోదయ్యే వర్షపాతం కన్నా 74 శాతం ఎక్కువని తెలిపింది. 1901 మేలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత తర్వాత, 1917 లో 32.68 డిగ్రీల సెల్సియస్, తర్వాత 1977లో 33.84 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా.. ప్రస్తుతం నాలుగోసారి అత్యల్పంగా ఈ మేలో 34.18 డిగ్రీల నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.
తుపానుల కారణంగానే..
ఈ రెండు తుపానులు పశ్చిమ, తూర్పు తీరాల వెంబడి ఉన్న రాష్ట్రాలపై మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వర్షపాతం తీసుకొచ్చాయని వెల్లడించింది. ఉదాహరణకు, 'తౌక్టే' తుఫాను బలహీనపడటంతో, ఇది ఉత్తర భారతదేశం వైపు వెళ్లి ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిపించింది. అదేవిధంగా, ‘యాస్’ తూర్పు భారతదేశంలో జార్ఖండ్, బీహార్‌తో సహా వర్షాలు కురిసింది. 2021 వేసవిలో మూడు నెలల్లో, ఉత్తర భారతదేశంలో పాశ్చాత్య అవాంతర కార్యకలాపాల పౌనపున్యాలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఇక మే 29, 30 తేదీలలో మాత్రమే వాయువ్య రాజస్థాన్‌లో మినహా దేశంలో ఎక్కడా కూడా చెప్పకోదగిన ఉష్ణోగ్రతలు సంభవించలేదని ఐఎండీ తెలిపింది.
చదవండి: గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు
Comments
Please login to add a commentAdd a comment