Record rainfall
-
Tamil Nadu Weather Updates: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం
చెన్నై: తమిళనాడుని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొన్నటి దాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. 12-14 గంటల వ్యవధిలో ఎడతెగని వర్షం కురిసింది. మణిముత్తర్, తిరుచెందూర్లలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం సంభవించింది. 500 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడులో ఇటీవల కాలంలో ఇంతటి స్థాయిలో వర్షపాతం రావడం ఇదే ప్రథమం. Kanniyakumari Flood #TamilNadu #tamilnadurain @Savukkumedia @SavukkuOfficial pic.twitter.com/JgEwbobeba — Abdul Muthaleef (@MuthaleefAbdul) December 17, 2023 దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్‌కాశి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు,ప్రైవేటు సంస్థల ఆఫీసులకు ఇప్పటికే సెలవు ప్రకటించింది. దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది. పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. Fire engine itself got stuck near V.O.C port ,Thoothukudi#TNRains #Tirunelveli #TamilNadu pic.twitter.com/Sc4PbSgQ4I — West Coast Weatherman (@RainTracker) December 18, 2023 ‘కన్యాకుమరి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెన్‌కాశీ జిల్లాల్లో భారీ వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్)కు చెందిన 250 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం నియమించాం’ అని తమిళనాడు రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి రామచంద్రన్ తెలిపారు. Historic Deluge: #Kayalpattinam in #Thoothukudi Receives Record-Breaking 932mm of Rain in 24hrs Visuals of Thoothukudi bypass road in TN as district recorded Exceptionally heavy Rainfall #HeavyRain #TamilNaduWeather #TamilnaduRain #ThoothukudiRains pic.twitter.com/nASBMG0Y2D — sudhakar (@naidusudhakar) December 18, 2023 Dear Chennai MEDIA. Tamilnadu is not limited upto Chennai border!🤦🏾♂️🤦🏾♂️#Nellai_Rain@polimernews@PTTVOnlineNews @sunnewstamil@news7tamil@NewsTamilTV24x7pic.twitter.com/6JNCBwPfuG — Tirunelveli (@Porunaicity) December 17, 2023 ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
భారత్‌లో 121 ఏళ్ల తర్వాత ఇది రెండోసారి..
న్యూఢిల్లీ: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గత 121 ఏళ్లలో రెండో అత్యధిక వర్షంపాతం మే నెలలో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ గురువారం తన నివేదికలో తెలిపింది. మేలో కురిసిన రికార్డు వర్షపాతానికి.. క్రితం సంభవించిన టౌటే, యాస్ తుపానుల ప్రభావము, పాశ్చాత్య అవాంతరాలు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా 2021 మేలో 107.9 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. ఇది సాధారణం నమోదయ్యే వర్షపాతం కన్నా 74 శాతం ఎక్కువని తెలిపింది. 1901 మేలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత తర్వాత, 1917 లో 32.68 డిగ్రీల సెల్సియస్, తర్వాత 1977లో 33.84 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా.. ప్రస్తుతం నాలుగోసారి అత్యల్పంగా ఈ మేలో 34.18 డిగ్రీల నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. తుపానుల కారణంగానే.. ఈ రెండు తుపానులు పశ్చిమ, తూర్పు తీరాల వెంబడి ఉన్న రాష్ట్రాలపై మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వర్షపాతం తీసుకొచ్చాయని వెల్లడించింది. ఉదాహరణకు, 'తౌక్టే' తుఫాను బలహీనపడటంతో, ఇది ఉత్తర భారతదేశం వైపు వెళ్లి ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిపించింది. అదేవిధంగా, ‘యాస్’ తూర్పు భారతదేశంలో జార్ఖండ్, బీహార్‌తో సహా వర్షాలు కురిసింది. 2021 వేసవిలో మూడు నెలల్లో, ఉత్తర భారతదేశంలో పాశ్చాత్య అవాంతర కార్యకలాపాల పౌనపున్యాలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఇక మే 29, 30 తేదీలలో మాత్రమే వాయువ్య రాజస్థాన్‌లో మినహా దేశంలో ఎక్కడా కూడా చెప్పకోదగిన ఉష్ణోగ్రతలు సంభవించలేదని ఐఎండీ తెలిపింది. చదవండి: గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు -
ఎడతెగని వాన.. వందేళ్ల రికార్డు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: నగరం సాగరమైంది.. వీధులు నదులయ్యాయి. దారులు గోదారుల య్యాయి.. కుండపోత.. గుండెకోతను మిగిల్చింది. నీట మునిగిన ఇళ్లు.. బతుకమ్మలను తలపించాయి. జడివాన.. అలజడి సృష్టించింది. జలఖడ్గానికి జనం కకావికలమయ్యారు. 1,500 పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి.. 20,540 ఇళ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి.. ఇదీ భాగ్యనగరం పరిస్థితి. వందేళ్ల తర్వాత కురిసిన రికార్డు వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వానలకు నాలాలు ఉప్పొంగాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులు తెగిపోయాయి. కుంటలు పొంగిపొర్లాయి. వాటిల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి చేరాయి. విజయవాడ, కరీంనగర్, వరంగల్ మార్గాలు జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీలోని ఈస్ట్, సౌత్ జోన్లలో ఎక్కువ నష్టం వాటిల్లింది. నగరంలో 1,500 కాలనీలకుపైగా నీట మునిగాయి. సరూర్‌నగర్, గడ్డిఅన్నారం, దిల్సుఖ్నగర్ పాంతాల్లో దాదాపు 200 కాలనీలు జలమయమయ్యాయి. బోయిన్‌చెరువు తెగడం, హస్మత్‌పేట నాలా పొంగిపొర్లడంతో దాదాపు 100 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఉప్పల్, కుషాయిగూడ, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, కొత్తపేట, బోయిన్పల్లి, మల్కాజిగిరి, మీర్‌పేట, పాతబస్తీలోని పలు కాలనీలు నీటచిక్కి గజగజ వణికాయి. ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోయాయి. వరదనీరు బుధవారం మధ్యాహ్నానికి కూడా తగ్గలేదు. టోలిచౌకి నదీం కాలనీ, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఫలక్‌నుమా, కవాడిగూడ అరవింద్ కాలనీ, రామంతా పూర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను బోట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్, ఆర్మీ తదితర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నగరంలోని 122 ప్రాంతాల్లో 20,540 ఇళ్లు నీట మునిగినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. దాదాపు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, లక్షా యాభై వేల మందికి ఆహారం అందజేసినట్లు తెలిపింది. 24 గంటలు పనిచేసే 30 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఆలయాల్లోకి చేరిన నీరు.. బల్కంపేట ఎల్లమ్మగుడిలోకి సైతం అమ్మవారి పాదా ల వరకు వర్షపునీరు చేరింది. దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి, పురానాపూల్ శివాలయాల్లోకి వరదనీరు చేరింది. వానకు తడిసిపోయి దా దాపు 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి. ప్రధాన రహదారుల్లో .. ప్రధాన రహదారుల మార్గాల్లోని మలక్‌పేట రైల్వేస్టేషన్, డబీర్‌పురా కమాన్, యశోద ఆస్పత్రి, నల్ల గొండ క్రాస్‌రోడ్, శాలివాహన నగర్, సంతోష్‌నగర్ రాయల్సీ హోటల్, ఓల్డ్ చాంద్రాయణగుట్ట, హుమాయూన్‌నగర్, గుడిమల్కాపూర్, బజార్‌ఘాట్, బేగంబజార్, కింగ్‌కోఠి ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, కోఠి, అఫ్జల్‌గంజ్, బషీర్‌బాగ్, జియాగూడ, అశోక్‌నగర్ బ్రిడ్జి, ఇందిరాపార్కు, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, నారాయణగూడ, నింబోలిఅడ్డ రైల్వే బ్రిడ్జి, తిలక్‌నగర్ జంక్షన్, గోల్నాక చర్చి, రామంతాపూర్, నారాయణగూడ, ఫీవర్ హాస్పిటల్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్, మైత్రివనం, లక్డీకాపూల్, నిమ్స్, కేసీపీ జంక్షన్, పంజగుట్ట, షేక్‌పేట, కర్బలా క్రాస్‌రోడ్స్, బేగంపేట జలమయమయ్యాయి. కొట్టుకుపోయిన బ్రిడ్జి ఫెన్సింగ్.. మూసారాంబాగ్ బ్రిడ్జి ఫెన్సింగ్ రెండువైపులా కొట్టుకుపోయింది. హుస్సేన్‌సాగర్ నీరు పూర్తిస్థాయి మట్టాని కంటే ఎక్కువై తూముల గుండా దిగువకు ప్రవహిస్తోంది. రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించేందుకు డివైడర్లు ధ్వంసం చేశారు. దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కోఠి– దిల్సుఖ్నగర్ మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. నీళ్లలో కాలనీలు.. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలోని 30 సర్కిళ్లలో పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కాప్రా సర్కిల్లోని అంబేద్కర్‌నగర్ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, ఉప్పల్ సర్కిల్లోని రామంతాపూర్, పీవీఆర్ కాలనీ, ఎల్బీనగర్ సర్కిల్లోని గుంటి జంగయ్యనగర్, రెడ్డికాలనీ, మల్లికార్జుననగర్, వెంకటేశ్వరకాలనీ, గ్రీన్‌పార్క్ కాలనీ, మారుతీనగర్, గ్రీన్‌పార్క్ కాలనీ, మారుతీనగర్, తపోవన్ కాలనీసహా ఇరవైకిపైగా కాలనీలు నీటమునిగాయి. సరూర్‌నగర్ సర్కిల్లోని భవానీనగర్, నాగోల్, అల్కాపురి తదితర కాలనీలు, మలక్‌పేట సర్కిల్లోని శంకర్‌నగర్, మూసానగర్, సంతోష్‌నగర్ సర్కిల్లోని సింగరేణికాలనీ, రెయిన్‌బజార్, తలాబ్ చంచలం, పాతబస్తీ పరిధిలోని ముర్గిచౌక్, మీరాలం, అల్‌జుబేల్ కాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. వీటితోపాటు కోర్‌సిటీలోని బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, అశోక్‌నగర్, దోమలగూడ, రత్నానగర్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, తారానగర్, చందానగర్‌లోని దీప్తిశ్రీనగర్, కూకట్‌పల్లిజోన్‌లోని ఫతేనగర్, భరత్‌నగర్, అల్లాపూర్, బాలానగర్, కల్యాణ్‌నగర్, సుభాష్‌నగర్, పేట్‌బషీరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ కాలనీలు నీటమునిగాయి. 24 మంది మృత్యువాత రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఏకంగా 24 మంది మరణించారు. ఈమేరకు అధికారులు బుధవారం ధ్రువీకరించారు. భారీ వర్షాలతో చాలా చోట్ల వరదలు పోటెత్తాయి. కొన్నిచోట్లఇళ్ల నుంచే వరద సాగడంతో ఆ ప్రవాహంలో పలువురు కొట్టుకుపోయి విగతజీవులయ్యారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 11 మంది మరణించారు. రంగారెడ్డి జిల్లాలో ఏడుగురు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు, మేడ్చల్ జిల్లాలో ఇద్దరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. మళ్లీ మొదలైన వాన.. రాజధానిలో బుధవారం ఉదయం నుంచి కాస్త తెరిపినిచ్చిన వాన రాత్రి మళ్ళీ మొదలైంది. వాయుగుండం ప్రభావంతో రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అసలే అంధకారంలో ఉన్న ముంపు ప్రాంతాల్లో ఈ వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తమయ్యాయి. సహాయక బృందాలను రంగంలోకి దింపాయి. -
శ్రీకాకుళం జిల్లాలో 65 సెంటీమీటర్ల వర్షపాతం
-
శ్రీకాకుళం జిల్లాలో రికార్డు వర్షపాతం
శ్రీకాకుళం: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమయింది. పై-లీన్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే సిక్కోలుపై అల్పపీడనం విరుచుకుపడింది. రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీవర్షాలతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. 36 గంటలుగా శ్రీకాకుళం జిల్లా లో కుండపోత వానకురుస్తుండటంతో - ఇచ్చాపురం, మందస, కవిటి, కంచలి, సోంపేట మండలాల్లోని ఎనభై లోతట్టు గ్రామాలు నీటమునిగాయి. ఇచ్చాపురం వద్ద బహుదా నది నీరు పొంగిపోర్లుతోంది. రైల్వే ట్రాక్, జాతీయ రహదారి నీటమునిగాయి. దీంతో భువనేశ్వర్ - విశాఖపట్నం ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ పై నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో_ పలు రైలు మళ్లించారు . కొన్ని రైళ్లను రద్దు చేశారు . జాతీయరహదారిపై ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.రెండు బస్సులు వరదనీటి లో చిక్కుకున్నాయి. మరోవైపు ఊళ్లకు ఊళ్లు వరద ముట్టడిలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి నందిగాం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. బాహూదా నదికి వరద ముప్పు పొంచివుండడంతో 6 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు వర్షపాతం నమోదయింది. కంచిలిలో 65 సెంటీమీటర్లు, సోంపేటలో 57.5 సెం.మీ, శ్రీకాకుళంలో 54.4 సెం.మీ, పోలాకిలో 51.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందన్న సమాచారంతో సిక్కోలు వాసులు భీతిల్లుతున్నారు.