
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం తాండవం చేస్తోంది. కరోనా వైరస్ తొలిదశ కంటే రెండోదశ విజృంభించడంతో కేసుల సంఖ్యతో పాటూ మరణాల సంఖ్య పెరిగిపోతుంది. తొలిదశలో రోజూవారి నమోదయ్యే కేసుల సంఖ్య వేలల్లో ఉంటే కోల్పోయే ప్రాణాలు పదుల్లో ఉండేవి. కానీ రెండో దశలో అలా కాదు కరోనా దాని స‍్వరూపం మార్చేసి సామాన్యుడిపై ప్రతాపాన్ని చూపిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కభళించేందుకు దూసుకు రావడంతో రోజూ వారి కేసుల సంఖ్య మూడు నుంచి నాలుగు లక్షలు కరోనా సోకుతుంటే మరణాల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి.దీనికి తోడు దేశంలో ఎన్నికల నిర్వహణ కరోనా వ్యాప్తికి మరింత ఊతమిచ్చినట్లైంది. అయితే ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ వైపు మొగ్గు చూపుతున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11,21,102 పైగా కరోనా సోకగా.. వారిలో 9,82,297 మందికి తగ్గుముఖం పట్టింది. 8053 మంది మరణించారు. ఇక తెలంగాణలో 4,51వేల మందికి కరోనా సోకి.. 3లక్షల 68వేల మందికి తగ్గింది. 2,368 మంది మరణించారు. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు నైట్ కర్ఫ్యూని విధించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటూ ఏ రాష్ట్రాల్లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి. ఎక్కడెక్కడ లాక్ డౌన్ విధించారో తెలుసుకుందాం.
State/UT | Confirmed Cases | Active Case | Cured/Discharged | Death | Lockdown/Curfew Status |
అండమాన్/ నికోబార్ దీవులు | 6046 | 205 | 5773 | 68 | |
ఆంధ్రప్రదేశ్ | 1121102 | 130752 | 982297 | 8053 | నైట్ కర్ఫ్యూ రాత్రి 10 నుండి 5 వరకు |
అరుణాచల్ ప్రదేశ్ | 18636 | 1387 | 17190 | 59 | పాక్షిక లాక్ డౌన్ |
అస్సాం | 256576 | 26374 | 228872 | 1330 | నైట్ కర్ఫ్యూ రాత్రి 8 నుండి ఉదయం 6 వరకు |
బీహార్ | 484106 | 108203 | 373261 | 2642 | నైట్ కర్ఫ్యూ సాయంత్రం 6 నుండి 6 వరకు |
చండీగఢ్ | 43446 | 7222 | 35735 | 489 | వారం రోజుల లాక్ డౌన్ |
ఛత్తీస్‌గఢ్ | 744602 | 121099 | 614693 | 8810 | ఎనిమిది జిల్లాల్లో లాక్ డౌన్ |
దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డియు | 7712 | 1867 | 5841 | 4 | |
ఢిల్లీ | 1174552 | 96747 | 1061246 | 16559 | మే 10వరకు లాక్ డౌన్ కొనసాగింపు |
గోవా | 93355 | 23884 | 68249 | 1222 | మే 3 వరకు లాక్‌డౌన్ |
గుజరాత్ | 581624 | 145139 | 429130 | 7355 | 20 నగరాల్లో రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు |
హరియాణా | 501566 | 102516 | 394709 | 4341 | మే 31 వరకు పాక్షిక లాక్డౌన్ & నైట్ కర్ఫ్యూ |
హిమాచల్ ప్రదేశ్ | 102038 | 19928 | 80585 | 1525 | మే 10 వరకు 4 జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ |
జమ్మూ- కాశ్మీర్ | 179915 | 30343 | 147242 | 2330 | మే 3 వరకు 11 జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ |
జార్ఖండ్ | 239734 | 58437 | 178468 | 2829 | మే 6 వరకు లాక్ డౌన్ |
కర్ణాటక | 1564132 | 405088 | 1143250 | 15794 | మే 9 వరకు కరోనా కర్ఫ్యూ |
కేరళ | 1606819 | 324169 | 1277294 | 5356 | రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు కర్ఫ్యూ |
లడఖ్ | 14086 | 1400 | 12542 | 144 | వీకెండ్ కర్ఫ్యూ |
లక్షద్వీప్ | 2923 | 1438 | 1481 | 4 | |
మధ్యప్రదేశ్ | 575706 | 88511 | 481477 | 5718 | కరోనా కర్ఫ్యూ మే 7 వరకు |
మహారాష్ట్ర | 4665754 | 665837 | 3930302 | 69615 | మే 15 వరకు లాక్డౌన్ |
మణిపూర్ | 31905 | 1652 | 29843 | 410 | మే 7 వరకు లాక్డౌన్ |
మేఘాలయ | 17108 | 1659 | 15275 | 174 | |
మిజోరం | 6299 | 1299 | 4985 | 15 | |
నాగాలాండ్ | 14134 | 1353 | 12674 | 107 | నైట్ కర్ఫ్యూ |
ఒడిశా | 454607 | 61505 | 391048 | 2054 | నైట్ కర్ఫ్యూ |
పుదుచ్చేరి | 60001 | 10263 | 48921 | 817 | |
పంజాబ్ | 377990 | 58229 | 310601 | 9160 | నైట్ కర్ఫ్యూ రాత్రి 8 నుండి ఉదయం 5 వరకు |
రాజస్థాన్ | 615653 | 182301 | 428953 | 4399 | మే 3 వరకు లాక్డౌన్ |
సిక్కిం | 8211 | 1647 | 6416 | 148 | |
తమిళనాడు | 1186344 | 117405 | 1054746 | 14193 | నైట్ కర్ఫ్యూ మరియు ఆదివారం పూర్తి లాక్డౌన్ |
తెలంగాణ | 450790 | 80695 | 367727 | 2368 | రాత్రి కర్ఫ్యూ రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు |
త్రిపుర | 35589 | 1471 | 33720 | 398 | |
ఉత్తర ప్రదేశ్ | 1282504 | 301833 | 967797 | 12874 | మే 4 వరకు లాక్డౌన్ |
ఉత్తరాఖండ్ | 186014 | 51127 | 132156 | 2731 | మే 1 వరకు లాక్డౌన్ |
పశ్చిమ బెంగాల్ | 845878 | 116659 | 717772 | 11447 |
Comments
Please login to add a commentAdd a comment