రెండ్రోజుల పాటు సాగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్ భేటీలో పన్నురేట్లపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని అంశాలపై స్పష్టత వచ్చినా... తుది నిర్ణయానికి రావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. విలాస వస్తువులు, పొగాకు వంటి ఉత్పత్తులపై సెస్సు విధింపు అంశంలో కొంత ఏకాభిప్రాయం వచ్చినా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నియంత్రణలోని 11 లక్షల సేవా పన్ను అంచనాలపై కూడా ఏకాభిప్రాయం రాలేదు. 6, 12, 18, 26 శాతం శ్లాబ్‌ల విభజన, నిత్యావసరాలపై తక్కువ, విలాస వస్తువులు, పొగాకు వంటి వస్తులపై ఎక్కువ పన్ను విధింపుపై రాష్ట్రాలు చాలావరకూ అనుకూలంగానే ఉన్నా... నవంబర్ 3, 4 తేదీల్లో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు