ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా మూడో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించారు. జీడీపీ వృద్ధిలో అత్యంత కీలకమైన ఎగుమతులు పుంజుకునేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపడం కోసం రూ.70,000 కోట్ల ప్యాకేజీని శనివారం ప్రకటించారు. వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు పలు ఉద్దీపన చర్యలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో ప్రకటన చేసి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును నిలబెట్టేందుకు శతవిధాల ప్రయతి్నస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచి్చంది. ఈ జోష్‌తో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడి ప్రధాన సూచీలు ఊర్థ్వ ముఖంగా ప్రయాణించే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉద్దీపన చర్యల అంశానికి అంతర్జాతీయ సానుకూలతలు జతైతే మార్కెట్‌లో కొనుగోళ్లు ఊపందుకుంటాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. రానున్న పండుగల సీజన్‌లో వినియోగదారుల వ్యయం ఏ విధంగా ఉండనుందనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ కొనుగోళ్లు జరిగేందుకు ఆస్కారం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ విశ్లేíÙంచారు.
ఆరి్థక అంశాలపై మార్కెట్ దృష్టి..!
ఆగస్టు నెల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) డేటా సోమవారం విడుదలకానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వల సమాచారం, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇక గోవాలో జీ ఎస్‌టీ కౌన్సిల్ శుక్రవారం సమావేశంకానుంది.
ఎఫ్‌ఓఎంసీ సమావేశం ఈవారంలోనే..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం.. మంగళ, బుధవారాల్లో జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గేందుకు అవకాశం ఉందని అబాన్స్ గ్రూప్ చైర్మన్ అభిõÙక్ బన్సాల్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన వడ్డీ రేటు నిర్ణయాన్ని గురువారం ప్రకటించనుంది.
సెపె్టంబర్‌లో రూ.1,841 కోట్ల పెట్టుబడి...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సెపె్టంబర్‌లో ఇప్పటివరకు రూ.1,841 కోట్ల పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 3–13 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,031 కోట్లను ఉపసంహరించుకున్నట్లు తేలింది. అయితే, డెట్ మార్కెట్‌లో రూ.3,872 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి రూ.1,841 కోట్లుగా డేటాలో వెల్లడయింది. ఇక ఈక్విటీ, డెట్ మార్కెట్లలో కలిపి ఆగస్టులో రూ.5,920 కోట్లు, జూలైలో రూ.2,986 కోట్లను వీరు ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment